కుటుంబశ్రీ ఆహారం... ఆన్‌లైన్‌లోనూ!

పేదరిక నిర్మూలన, మహిళా సాధికారత కోసం కేరళ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్యక్రమం కుటుంబశ్రీ. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు ఉపాధి పొందినట్లే, కేరళలో కుటుంబశ్రీ పథకం సాయంతో ఆర్థిక భరోసా అందుకుంటున్నారు.

Eenadu icon
By Vasundhara Team Published : 30 Oct 2025 00:52 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

పేదరిక నిర్మూలన, మహిళా సాధికారత కోసం కేరళ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్యక్రమం కుటుంబశ్రీ. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు ఉపాధి పొందినట్లే, కేరళలో కుటుంబశ్రీ పథకం సాయంతో ఆర్థిక భరోసా అందుకుంటున్నారు. ఈ పథకం కింద ఎన్నో రకాల స్వయం ఉపాధి కార్యక్రమాలు సాగుతున్నాయి. ఆహార విభాగంలో ఇప్పటికే సుమారు 964 జనకీయ హోటల్స్, 13 కుటుంబశ్రీ ప్రీమియం రెస్టారెంట్‌లు ఏర్పాటయ్యాయి. అదనంగా మరో 500 కుటుంబశ్రీ సంస్థలు జొమాటో, స్విగ్గీ వంటి ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఆహారాన్ని సరఫరా చేస్తున్నాయి. ఇవి కాకుండా త్వరలో కేఎఫ్‌సీ తరహా ఫ్రైడ్‌ చికెన్‌ అవుట్‌లెట్లనూ ప్రారంభించనున్నారట. ఇందులో భాగంగానే తిరువనంతపురం నుంచి కాసర్‌గోడ్‌ మధ్య ఏడు రకాల స్పైసీ క్రిస్పీ ఫ్రైడ్‌ చికెన్‌లను అందించే 50 యూనిట్లను తెరవనున్నారు. ప్రత్యేకంగా టేక్‌ అవే, ఆన్‌లైన్‌ ఆర్డర్లపై  దృష్టి సారించనున్నారట. అధిక నాణ్యతతో తక్కువ ధరకు చికెన్‌ వంటకాలను అందించడమే కాదు... ఈ ప్రయత్నం ఎన్నో కుటుంబాల్లో సంపదనూ సృష్టిస్తుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌తో సహా పలు రైళ్లలో ఈ ఫ్రైడ్‌ చికెన్‌ వంటకాలను సరఫరా చేయడానికి వారు రైల్వే అధికారులనూ సంప్రదిస్తున్నారట. ఇప్పటికే ఎర్నాకుళంలోని కుటుంబశ్రీ యూనిట్‌ సమృద్ధి జన శతాబ్ది, పరశురాం, ఇంటర్‌సిటీ వేనాడ్‌ రైళ్లకు ఆహార సరఫరా కాంట్రాక్టులను సంపాదించుకుంది. రైల్వేస్‌ ‘మదద్‌’ యాప్‌ ద్వారా ఆహారాన్ని డెలివరీ చేస్తోంది. మంచి ప్రయత్నమే కదూ! 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్