ఈ మంత్రి... 83 మంది పిల్లల గర్భవతి!

అనగనగా ఓ దేశం... పేరు అల్బేనియా. ఒకప్పుడు అక్కడ ఎటు చూసినా  అవినీతి ఏరులై పారేది. దీనికి ఎలాగైనా చరమగీతం పాడాలనుకున్నారా దేశ ప్రధాని ఎడీ రామా.

Eenadu icon
By Vasundhara Team Updated : 28 Oct 2025 05:18 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

అనగనగా ఓ దేశం... పేరు అల్బేనియా. ఒకప్పుడు అక్కడ ఎటు చూసినా  అవినీతి ఏరులై పారేది. దీనికి ఎలాగైనా చరమగీతం పాడాలనుకున్నారా దేశ ప్రధాని ఎడీ రామా. అందుకోసం ఏర్పాటుచేసిన వ్యవస్థలో కృత్రిమ మేధనీ భాగం చేశారు. ఫలితమే  డీయెలా...

క్యాబినెట్‌ మినిస్టర్‌... వర్చువల్‌ మంత్రి. ముఖ్యంగా ప్రైవేటు సంస్థల నుంచి ప్రభుత్వం కొనే వస్తువుల్లో చోటు చేసుకునే అవినీతిని అరికట్టేందుకే గత నెలలో ఈ ఏఐ ఆధారిత చాట్‌బాట్‌ను మంత్రిగా నియమించారు. అదే ఓ అద్భుతమైతే, ప్రస్తుతం ఆమె 83 మంది పిల్లల(డిజిటల్‌ అసిస్టెంట్ల) గర్భవతి’ అని మరో సంచలన ప్రకటన చేశారా దేశ ప్రధాని.

‘ఈ పిల్లలు 83 మంది పార్లమెంటరీ సభ్యులకి సహాయకులుగా పనిచేస్తారు.  క్యాబినెట్‌లో జరిగే చర్చలన్నింటినీ రికార్డు చేసి, సారాంశాన్ని సభ్యులకు అందిస్తారు, ఎక్కడైనా మిస్‌ అయితే సలహాలూ ఇస్తారు. ఉదాహరణకు కాఫీ తాగడానికి వెళ్లి తిరిగి సభకు రావడం ఆలస్యమైతే, వాళ్లు లేనప్పుడు సభలో ఏం జరిగిందో వివరిస్తారు. వచ్చాక ఎవరెవరికి సమాధానం చెప్పాలో కూడా సూచిస్తారు. వచ్చే ఏడాది చివరికల్లా ఈ పిల్లలు పూర్తిస్థాయిలో అందివస్తార’ని ఆయన సరదాగా చెప్పుకొచ్చారు.

సంప్రదాయ అల్బేనియన్‌ దుస్తులు ధరించిన ఈ ఏఐ మంత్రి సైతం ఓ సందర్భంలో పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగిస్తూ... ‘నేను ఇక్కడ ఎవరి స్థానాన్నీ భర్తీ చేయడానికి రాలేదు. సహాయం చేయడానికే ఉన్నాను. నాకు పౌరసత్వం లేదు. వ్యక్తిగత ఆశయం, ఆసక్తులు కూడా లేవు’ అంటూ రాజకీయాల్లో తన అవసరాన్ని చెప్పారట. ఇప్పటికే పది లక్షలకన్నా ఎక్కువ డిజిటల్‌ విచారణలను డీయెలా సులభతరం చేశారని అధికారులు చెబుతున్నారు. క్యాబినెట్‌ పదవిని చేపట్టడానికి ముందు డీయెలా ఆ దేశ పోర్టల్‌లో వర్చువల్‌ అసిస్టెంట్‌గా పనిచేశారు. పౌరులు, వ్యాపారులకు డాక్యుమెంట్లు మంజూరు చేయడం, ప్రభుత్వ విధానాల గురించి గైడ్‌ చేయడంలో తోడ్పడ్డారట.  అవినీతిని అంతం చేయాలన్న ఆ దేశ ప్రధాని కలను డీయెలా... ఆమె పిల్లలు సాకారం చేస్తారని ఆశిద్దాం!

Tags :
Published : 28 Oct 2025 01:16 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్