కరిగిపోయే ప్లాస్టిక్‌.. కనిపెట్టింది!

ప్లాస్టిక్‌ ఎంత హానికరమో, అది పర్యావరణాన్ని ఎంతగా నాశనం చేస్తుందో మనందరికీ తెలిసిందే. కానీ తక్కువ ధరతో ఎక్కువ మన్నికనిస్తాయని దూరం పెట్టలేని స్థితి. ఈ నేపథ్యంలో నేహా జైన్‌ ఏం చేసిందంటే... మనం ప్లాస్టిక్‌ను ఎంత వద్దనుకున్నా వంటింట్లో గిన్నెల దగ్గర్నుంచీ పెన్ను, స్టూలు లాంటి సాధనాలు..

Published : 11 Feb 2023 00:18 IST

ప్లాస్టిక్‌ ఎంత హానికరమో, అది పర్యావరణాన్ని ఎంతగా నాశనం చేస్తుందో మనందరికీ తెలిసిందే. కానీ తక్కువ ధరతో ఎక్కువ మన్నికనిస్తాయని దూరం పెట్టలేని స్థితి. ఈ నేపథ్యంలో నేహా జైన్‌ ఏం చేసిందంటే...

నం ప్లాస్టిక్‌ను ఎంత వద్దనుకున్నా వంటింట్లో గిన్నెల దగ్గర్నుంచీ పెన్ను, స్టూలు లాంటి సాధనాలు.. ఆఖరికి కరెంటు వైర్లతో సహా అంతటా ఆక్రమించేసింది. అందుకే వినియోగించక తప్పడం లేదు. అన్నింటా అదే ఉంటూ ‘నేను లేకుండా రోజు గడుస్తుందా మీకు?’ అని సవాల్‌ విసురుతున్నట్టే ఉంటుంది. అందుకే దానికి ప్రత్యామ్నాయాలు కనిపెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎందరో కృషి చేస్తున్నారు. ముంబయికి చెందిన నేహా జైన్‌ కూడా ఆ ప్రయత్నమే చేసింది. తన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రయోగాలు చేసింది.

ప్లాస్టిక్‌ వ్యర్థాలు పల్లపు ప్రాంతాలకు ముఖ్యంగా నదీనదాలూ సముద్రాల్లో పేరుకుపోతాయి. ఇక అవి చేసే అనర్థం అంతా ఇంతా కాదు. గాలి, నేల, నీరు, వాతావరణం.. అన్నిటినీ కలుషితం చేసి జీవరాశులన్నిటికీ చేటు చేస్తాయి. ఈ సమస్యకు పరిష్కారం అన్నట్టుగా సముద్రంలో ఏర్పడే నాచుతో ప్లాస్టిక్‌ను రూపొందిస్తోంది నేహ. అది కవర్లు, సంచులుగా ప్యాకేజీకి ఉపయోగపడుతూనే పర్యావరణ కాలుష్యాన్ని నివారిస్తోంది. ఇది అతి తక్కువ ధరకే లభిస్తుంది. పైగా పూర్తిగా భూమిలో కరిగిపోతుంది.

గూగుల్‌ సంస్థలో ఐదేళ్లు పనిచేసింది నేహ. కానీ ఆ ఉద్యోగంతో ఆమె సంతృప్తిచెందలేదు. తన సాంకేతిక నైపుణ్యం సమాజానికి హితం చేయాలనుకుంది. అలా ఆలోచిస్తున్నప్పుడు వందల సంవత్సరాలు భూమిలో కరగకుండా అనర్థాలు కలిగించే ప్లాస్టిక్‌ పెనుసమస్యలా కళ్ల ముందు మెదిలింది. దాన్ని నిరోధించేందుకు పరిశోధనలు చేయగా.. వ్యర్థమైన నాచు సాధనంగా తోచింది. నాచు అంటే ఆల్గే తదితర మొక్కలు. వీటిని పెంచడానికి సారవంతమైన నేల, మంచినీళ్లు, ఎరువులు లాంటివేమీ అవసరం లేదు. నేహ ఆలోచనలు ఆకృతి దాల్చి 2020లో తన సంస్థ ‘జీరోసర్కిల్‌’ ఆరంభించింది. ఇక్కడ సముద్ర నాచుతో అతి తక్కువ ధరకు లభ్యమయ్యే ప్లాస్టిక్‌ రూపొందుతోంది. ఈ బృందం గుజరాత్‌, తమిళనాడు పొలాల్లో నాచును సేకరిస్తారు. దాని పొడితో హ్యాండ్‌బ్యాగులు, చేతిసంచులు, దుస్తులు, ఫిల్మ్‌లు, ఇంకెన్నో ప్లాస్టిక్‌ ప్రత్యామ్నాయాలు తయారవుతున్నాయి. ఈ ప్లాస్టిక్‌ జీవవైవిధ్యానికి ఎలాంటి హానీ కలిగించదు. ఖరీదు కూడా తక్కువైనందున అందరికీ అందుబాటులో ఉంటుంది. బాగుంది కదూ.. మనమూ ఉపయోగిద్దామా!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్