అక్కడ చెమటా? ఉపశమనం పొందండిలా!
ఈ వేసవి కాలం చెమట ఎన్నో సమస్యలకు దారితీస్తుంది.. వాతావరణంలోని తేమ వల్ల శరీరానికి గాలి తగిలినా.. జిడ్డుదనం, దురద, మంట.. వంటివి సహజం. ఇదిలా ఉంటే.. గాలి తగలని వ్యక్తిగత భాగాల్లో తలెత్తే ఇబ్బందుల గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వేసవిలో వచ్చే వెజైనా ఇన్ఫెక్షన్ కూడా ఇలాంటిదే! సిగ్గు, బిడియంతో ఈ సమస్య గురించి....
ఈ వేసవి కాలం చెమట ఎన్నో సమస్యలకు దారితీస్తుంది.. వాతావరణంలోని తేమ వల్ల శరీరానికి గాలి తగిలినా.. జిడ్డుదనం, దురద, మంట.. వంటివి సహజం. ఇదిలా ఉంటే.. గాలి తగలని వ్యక్తిగత భాగాల్లో తలెత్తే ఇబ్బందుల గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వేసవిలో వచ్చే వెజైనా ఇన్ఫెక్షన్ కూడా ఇలాంటిదే! సిగ్గు, బిడియంతో ఈ సమస్య గురించి ఎవరికీ చెప్పుకోలేక, దాచుకోలేక లోలోపలే కుమిలిపోతున్నారు చాలామంది అమ్మాయిలు. అయితే కొన్ని సహజసిద్ధమైన మార్గాలు ఈ సమస్యకు శాశ్వత, సురక్షితమైన పరిష్కారం చూపుతాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం రండి..
కారణాలేంటి?
ఈ కాలంలో కేవలం చెమట వల్లే ఈ సమస్య వస్తుందనుకోవద్దంటున్నారు నిపుణులు. దీంతో పాటు వ్యాయామం చేసే క్రమంలో శరీరం నుంచి విడుదలయ్యే అధిక వేడి, వెజైనాను పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం, అవాంఛిత రోమాలు తొలగించుకోకపోవడం, కాలానికి తగ్గ లోదుస్తుల్ని ఎంచుకోకపోవడం, అధిక బరువు, ప్లాస్టిక్ మెటీరియల్‌తో రూపొందించిన శ్యానిటరీ న్యాప్కిన్లు, ప్యాంటీ లైనర్లు.. వంటివన్నీ అధిక చెమటకు కారణమై.. తద్వారా వివిధ రకాల ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయని చెబుతున్నారు. అందుకే కాలమేదైనా వెజైనాను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లతో పాటు ఎన్నో ప్రత్యుత్పత్తి సమస్యలు, ప్రమాదకర క్యాన్సర్లకు దూరంగా ఉండచ్చని సూచిస్తున్నారు.
‘సహజ’ పరిష్కారముంది!
ఈ వేసవిలో వెజైనా సమస్యలు/ఇన్ఫెక్షన్లు తలెత్తకుండా.. ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే సహజసిద్ధమైన పరిష్కార మార్గాలతో పాటు కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. అవేంటంటే..!
* పాలిస్టర్, కాటన్.. వంటి మెటీరియల్స్‌కి చెమటను పీల్చుకొనే గుణం ఉంది. తద్వారా చర్మాన్ని ఎప్పుడూ పొడిగా ఉంచుకోవచ్చు. కాబట్టి ఆయా మెటీరియల్స్‌తో తయారుచేసిన లోదుస్తుల్ని అన్ని వేళలా ధరించడం ఉత్తమం.
* లోదుస్తులే కాదు.. ఇతర దుస్తుల విషయంలోనూ ఈ కాలంలో శ్రద్ధ వహించడం అత్యవసరం. ఈ క్రమంలో జీన్స్ వంటి బిగుతైన దుస్తులకు బదులు పలాజో, వైడ్లెగ్ ప్యాంట్స్, వదులుగా ఉండే కాటన్ ట్రౌజర్లు.. వంటివి చక్కటి ఎంపిక. ఇవి చెమటను పీల్చుకోవడంతో పాటు గాలి బాగా ఆడుతుంది.
* వ్యాయామం తర్వాత, బయటి నుంచి ఇంటికొచ్చిన తర్వాత.. ఇలా చెమట ఎక్కువగా వచ్చిన ప్రతిసారీ దుస్తుల్ని మార్చుకోవడం, శుభ్రంగా స్నానం చేయడం తప్పనిసరి.
* వెజైనాను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో భాగంగా ఆ ప్రదేశంలోని అవాంఛిత రోమాల్ని కూడా ఎప్పటికప్పుడు తొలగించుకోవడం ముఖ్యం. తద్వారా ఇన్ఫెక్షన్లు, దుర్వాసన.. వంటి సమస్యలకు చెక్ పెట్టచ్చు.
* స్నానం చేసే నీటిలో బేకింగ్ సోడా, యాపిల్ సిడార్ వెనిగర్, వేపాకులు వేసి మరిగించిన నీళ్లు.. వంటివి కలుపుకొని.. ఆ నీటితో స్నానం చేసినా ఇన్ఫెక్షన్లు, చెమట వల్ల వచ్చే దురదను నివారించుకోవచ్చు.
* వెజైనా నుంచి వెలువడే ఒక రకమైన డిశ్ఛార్జి ఆ భాగాన్ని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుతుంది. కాబట్టి ఆ భాగంలో బాడీ సోప్స్.. వంటివి అస్సలు వాడకూడదు. ఒకవేళ వాడితే అక్కడి మంచి బ్యాక్టీరియా, పీహెచ్ స్థాయుల బ్యాలన్స్ అదుపు తప్పి సమస్య మరింత ఎక్కువవుతుంది.
* వెజైనా ఆరోగ్యానికి ప్రొబయోటిక్ ఆహార పదార్థాలు చాలా ముఖ్యం. ఇందులో భాగంగా పెరుగు, పులియబెట్టిన పదార్థాలు.. వంటివి తరచూ తీసుకోవాల్సి ఉంటుంది. డాక్టర్ సలహా మేరకు అవసరమైతే ప్రొబయోటిక్ సప్లిమెంట్స్ కూడా వాడచ్చు. అలాగే రోజుకు రెండు నుంచి మూడు లీటర్ల నీళ్లు తాగాలి.
ఎప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి?
ఇవన్నీ పాటించినా.. వెజైనా దగ్గర చెమట - దురద తగ్గకపోయినా, మంటగా అనిపించినా, కలయిక సమయంలో ఇబ్బంది తలెత్తినా, ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వచ్చినా.. ఈ క్రమంలో మంటగా, ఇబ్బందిగా అనిపించినా.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అనుమానించి డాక్టర్‌ను సంప్రదించడం మేలు. తద్వారా అసలు సమస్యేంటో తెలుసుకొని దాని ప్రకారం చికిత్స అందిస్తారు. ఫలితంగా ఇది ఇతర సమస్యలకు దారితీయకుండా జాగ్రత్తపడచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అడ్డిగ... అందాల నగ!
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!