Published : 09/03/2023 01:13 IST

పని తప్ప ఇంకో ధ్యాస ఉండదు...

కోల్‌కతాలో పుట్టిన గీతా గోపీనాథ్‌, పై చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అంతర్జాతీయ ద్రవ్య నిధికి ప్రధాన ఆర్థికవేత్తగా నియమితులై ప్రశంసలందుకుంటున్నారు. ఐఎంఎఫ్‌లో చేరడానికి ముందు షికాగో యూనివర్సిటీలో సహాయ ప్రొఫెసర్‌గా, హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా సేవలందించారు.

‘భారతదేశంలో ఆడపిల్ల అనేదొక్కటే కాదు, ఏ కుటుంబంలో పుట్టారనేది కూడా చూస్తారు. అది వాళ్లమీదెంత ప్రభావం చూపుతుందో ఆలోచించరు. నేను మాత్రం నా సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాల గురించే ఆలోచిస్తాను. నాకు పని తప్ప ఇంకో ధ్యాస ఉండదు. ఇతరులు నా మీద వేసే రకరకాల ముద్రలను లక్ష్యపెట్టను. అబ్బాయిలతో పోలిస్తే నేను తక్కువనే భావన నాకెప్పుడూ కలగలేదు. ఒకరకంగా ఆ వైఖరి నా ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. స్త్రీలు దేశదేశాల విధివిధానాలు, ప్రస్తుత పరిస్థితులు, ఆర్థిక అంశాలు.. అన్నీ తెలుసుకోవాలి. ఇవి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉపయోగపడతాయి. కష్టం వచ్చాక బాధపడే కంటే అలాంటి పరిస్థితి రాకముందే అప్రమత్తంగా ఉండటం ఉత్తమం. వాణిజ్య వైరుధ్యాలను పరిష్కరించడానికి, వాతావరణ మార్పులకు సంబంధించి, సైబర్‌ భద్రతలో వచ్చే సమస్యలను పరిష్కరించడానికి, ఆయా విధివిధానాలను మెరుగుపరచడానికి మరింత సహకారం అవసరం. అవకాశం ఉన్న మహిళలు వ్యాపారం చేసేందుకు సిద్ధపడితే అది ఎందరికో ఉపాధి చూపుతుంది. ఆయా సంస్థల్లో స్త్రీల అవసరాన్ని గుర్తించి ఎందరో మహిళలకి స్థానం కల్పిస్తున్న మాట నిజమే. కానీ వాళ్లకి తగిన సదుపాయాలు సమకూర్చాల్సిన అవసరం ఉంది’ అంటారామె.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి