Published : 03/02/2023 00:10 IST

కష్టమంటే టాపరైంది!

‘చాలా కష్టం’ అంటే ఎవరైనా ఏదైనా చేయడానికి వెనకాడతారు. కానీ బంగారు లక్ష్మీ ప్రసన్నకి మాత్రం అలాంటివే చేయడం ఇష్టం. ఈ తత్వమే ఈ 18 ఏళ్ల అమ్మాయిని విజేతని చేసింది!

మాది హైదరాబాద్‌. అమ్మ లక్ష్మి, నాన్న బంగారు శ్రీనివాస్‌ రంగారెడ్డి జిల్లా కోర్టులో సీనియర్‌ అసిస్టెంట్‌. మొదట్నుంచీ చదువులో ముందే. కోర్టులో ఆడిటింగ్‌కి వచ్చిన ఛార్టెడ్‌ అకౌంటెంట్‌ను చూసి.. మా అమ్మాయీ అలాంటి గౌరవం దక్కే స్థాయిలో ఉండాలనుకున్నారట. అప్పుడే సీఏ గురించి వినడం. దాని గురించి తెలుసుకుంటోంటే.. ‘సీఏ కష్టం, అమ్మాయిలు చేయలేర’న్నారు. చిన్నప్పట్నుంచీ అందరికంటే భిన్నంగా చేయాలి, ప్రత్యేకంగా నిలవాలని ఉండేది నాకు. ఇదో సవాలులా అనిపించి సీఏనే చేయాలని నిర్ణయించుకున్నా. ఇంటర్‌ పరీక్షలవ్వడంతోనే మాస్టర్‌ మైండ్స్‌ సంస్థలో చేరా. ఉదయం 8 నుంచి రాత్రి 8 గం. వరకు శిక్షణ. వారాంతాల్లో పరీక్షలను పట్టుదలగా తీసుకునేదాన్ని. ఇన్ని గంటల కష్టం.. ఒత్తిడనిపించేది. కానీ నలుగురిలో ప్రత్యేకంగా ఉండాలంటే కష్టపడక తప్పదని నాకు నేనే చెప్పుకొనేదాన్ని. పరీక్షల్లో 350కి పైగా వస్తాయనుకుంటే 380 మార్కులతో సీఎంఏ ఫౌండేషన్‌లో ఆల్‌ ఇండియా మొదటి ర్యాంకర్‌నయ్యా. కష్టానికి ఫలితం దక్కిందనిపించింది.

ప్రొఫెషనల్‌ కోర్సులు చేయాలి, సీఏగా మంచి పేరు తెచ్చుకోవాలని కల. చదువే కాదు.. ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ ఆక్టివిటీస్‌లోనూ ముందే. తైక్వాండోలో బ్లాక్‌ బెల్ట్‌ సాధించా. జిల్లా, రాష్ట్ర ఛాంపియన్‌షిప్‌ల్లోనూ పాల్గొన్నా. కథలూ రాస్తుంటా. స్కూలు, కాలేజ్‌ నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో వ్యాసరచన, సైన్స్‌ ఫెయిర్‌, సెమినార్లు, డిబేట్‌ల్లో పాల్గొని బహుమతులూ సాధించా. నాకో తమ్ముడు. అమ్మాయి, అబ్బాయన్న తేడా మా ఇంట్లో లేదు. అందుకే ఎవరైనా చేయలేవంటే ప్రయత్నించాలనిపిస్తుంటుంది. విజయం సాధించాలనుకుంటే ఎవరైనా అనుసరించాల్సిన సూత్రమిది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి