తాతయ్య కోసం లైట్లు పంచుతూ..

చీకటి పడితే చాలు. సైకిల్‌కు లైట్లు అమర్చుకోండి అని రాసిన ప్లకార్డు చేతపట్టి రహదారుల పక్కగా నిలబడతోందామె.  లైటు లేని సైకిల్‌పై వెళుతున్న వారిని ఆపి, ఉచితంగా చీకట్లోనూ కనిపించే లైటు అమర్చి జాగ్రత్తలు చెబుతుంది. ఇలా లైట్లను ఉచితంగా అందించి వందలమంది ప్రాణాలు కాపాడుతున్న సామాజిక సేవాకార్యకర్త ఖుషీపాండే ఆ పని ఎందుకు చేస్తుందంటే..

Updated : 24 Mar 2023 03:06 IST

చీకటి పడితే చాలు. సైకిల్‌కు లైట్లు అమర్చుకోండి అని రాసిన ప్లకార్డు చేతపట్టి రహదారుల పక్కగా నిలబడతోందామె.  లైటు లేని సైకిల్‌పై వెళుతున్న వారిని ఆపి, ఉచితంగా చీకట్లోనూ కనిపించే లైటు అమర్చి జాగ్రత్తలు చెబుతుంది. ఇలా లైట్లను ఉచితంగా అందించి వందలమంది ప్రాణాలు కాపాడుతున్న సామాజిక సేవాకార్యకర్త ఖుషీపాండే ఆ పని ఎందుకు చేస్తుందంటే..

క దిల్లీలోనే ఏటా వెయ్యిమందికిపైగా సైకిల్‌వాలాలు చనిపోతున్నారు. లఖ్‌నవులోని అమీనాబాద్‌కు చెందిన 25 ఏళ్ల ఖుషీపాండే సామాజిక సేవాసంస్థలతో కలిసి ప్రజాసేవలో పాలుపంచుకుంటోంది. శీతాకాలంలో చలి ఎక్కువ ఉన్నప్పుడు పేదవారికి దుప్పట్లు, దుస్తుల వితరణ, అలాగే పేదపిల్లలకు విద్యనందేలా కృషి చేస్తోంది. గతేడాది ఖుషీ తాతయ్య సైకిల్‌పై వస్తూ ప్రమాదానికి గురై చనిపోయారు. చీకటిలో ఆయన సైకిల్‌ కనిపించకపోవడంతో కారు ఢీకొట్టింది. ఈ సంఘటన ఖుషీనెంతో బాధించింది. ‘ప్రజా సేవకురాలిగా కళాశాల స్థాయి నుంచి నిరుపేదల కోసం సేవలందిస్తున్న నేను మా తాతయ్యను కాపాడుకోలేకపోయా. ఇలా మరెవరూ రోడ్డు ప్రమాదాల్లో చనిపోకుండా ఉండాలంటే నావంతుగా ఏదైనా సాయం చేయాలనుకున్నా. చీకట్లో లైటు లేకుండా ప్రయాణించడం వల్ల జరుగుతున్న ప్రమాదాలను అరికట్టాలంటే ఆ సైకిళ్లు చీకట్లోనూ అందరికీ కనిపించాలి. అందుకే గతేడాది నుంచి ఉచితంగా సైకిళ్లకు లైట్లు అందించడం ప్రారంభించా. నేనే స్వయంగా లైట్లు అమర్చి పంపుతున్నా. మా వీధుల్లో ప్రతిరోజూ రాత్రుళ్లు ప్లకార్డుతో నిలబడతా. సైకిల్‌పై వెళ్లేవారిని ఆపి లైటు లేకపోతే ఉచితంగా లైటు అమర్చి పంపుతా. అలా ఇప్పటివరకు దాదాపు 1500 లైట్లు అమర్చగలిగా. దీనివల్ల ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి. ఇది నాకు సంతోషాన్నిస్తోంది. మా కుటుంబంలా మరెవరూ ప్రియమైన వారిని దూరం చేసుకోకూడదనేది నా లక్ష్యం’ అని చెబుతున్న ఖుషీ అందిస్తున్న సేవ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ప్రముఖులెందరో తమ ప్రశంసలను అందిస్తున్నారు. ప్రమాదాలు అరికట్టడంలో నీవంతు సేవలందిస్తున్నావంటూ అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఈమె చేస్తున్న సేవ చిన్నదైనా ఫలితం గొప్పదంటూ కితాబిస్తున్నారు. కనీసం ఏటా వెయ్యి మందికిపైగా మరణించకుండా కాపాడుతున్న ఖుషీని మరింతమంది ప్రాణాలను కాపాడాలంటూ ప్రోత్సహిస్తున్నారు. ఈ సేవలను దేశమంతా అందించాలనేదే తన లక్ష్యమంటున్న ఖుషీ తనలాంటి మరెందరికో స్ఫూర్తినిస్తోంది కదూ..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్