Janhvi Kapoor : నచ్చిందే పదే పదే తింటుంటా!

మనకేదైనా ఆహార పదార్థం బాగా నచ్చితే పదే పదే అదే తయారుచేసుకొని తింటుంటాం.. తానూ అంతేనంటోంది బాలీవుడ్‌ అందాల తార జాన్వీ కపూర్‌. తాను ఇష్టపడిన ఓ వంటకం రుచిని గత కొన్ని రోజులుగా ఆస్వాదిస్తున్నానంటూ ఈమధ్యే ఓ సందర్భంలో పంచుకుందీ ముద్దుగుమ్మ.

Published : 21 Apr 2024 16:10 IST

(Photos: Instagram)

మనకేదైనా ఆహార పదార్థం బాగా నచ్చితే పదే పదే అదే తయారుచేసుకొని తింటుంటాం.. తానూ అంతేనంటోంది బాలీవుడ్‌ అందాల తార జాన్వీ కపూర్‌. తాను ఇష్టపడిన ఓ వంటకం రుచిని గత కొన్ని రోజులుగా ఆస్వాదిస్తున్నానంటూ ఈమధ్యే ఓ సందర్భంలో పంచుకుందీ ముద్దుగుమ్మ. సహజంగానే ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలకు ప్రాధాన్యమిచ్చే జాన్వీకి నచ్చిన ఆ వంటకమేంటి? చక్కటి శరీరాకృతి కోసం తాను ఎలాంటి ఆహార నియమాలు పాటిస్తుంటుంది? తెలుసుకుందాం రండి..

⚛ ఫిట్‌నెస్‌, చక్కటి శరీరాకృతిని సొంతం చేసుకోవడం కోసం కొంతమంది తారలు నోరు కట్టేసుకుంటారు. కానీ తాను మాత్రం అలా చేయనంటోంది జాన్వీ. నచ్చిన ఆహారాన్ని ఆరోగ్యకరంగా తీసుకుంటూనే.. ఇటు ఫిట్‌నెస్‌నూ కాపాడుకుంటానంటోందీ చక్కనమ్మ.
‘ఆహారం విషయంలో నేను కొన్ని దశల్ని పాటిస్తుంటా. అంటే.. నాకేదైనా ఆహారం బాగా నచ్చితే దాన్ని ఆరోగ్యకరంగా తయారుచేయించుకొని పదే పదే అదే తింటుంటా. అలా గత కొన్ని రోజులుగా రాగి-చిలగడదుంపతో తయారుచేసిన పరాఠా రుచిని ఆస్వాదిస్తున్నా..’ అంటూ ఈ మధ్యే తాను పాటించే ఓ డైట్‌ సీక్రెట్‌ని బయటపెట్టిందీ కపూర్‌ బ్యూటీ.

⚛ డీటాక్స్‌ వాటర్‌తో రోజును ప్రారంభించడం జాన్వీకి ముందు నుంచే అలవాటట! ఈ క్రమంలోనే నిమ్మరసం, తేనె కలిపిన గోరువెచ్చటి నీటిని పరగడుపునే తాగుతానంటోందీ ముద్దుగుమ్మ.

⚛ రోజూ ఉదయాన్నే అల్పాహారంలో భాగంగా టీస్పూన్‌ నెయ్యి తీసుకుంటానని ఓ సందర్భంలో చెప్పుకొచ్చిందీ భామ. ఇది శరీరంలోని కొవ్వుల్ని కరిగించడంతో పాటు తన చర్మం, జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తుందని అంటోందీ చక్కనమ్మ.

⚛ ఇక అల్పాహారంలో భాగంగా కోడిగుడ్డు ఆమ్లెట్‌ను హెల్దీగా తయారుచేసుకొని తీసుకుంటుందట జాన్వీ. దీంతో పాటు తాజా పండ్లు, పండ్ల రసాల్నీ తాగుతానంటోంది. ఇక అప్పుడప్పుడూ పంజాబీ స్టైల్‌ పరాఠాల్నీ లాగించేస్తుంటుందట!

⚛ ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ కోసం కొంతమంది ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ పాటిస్తుంటారు. జాన్వీకి కూడా ఇది అలవాటట! ఈ క్రమంలోనే 16:8 రూల్‌ని ఎక్కువగా ఫాలో అవుతానంటోంది. అంటే.. 8 గంటలు ఆహారం తీసుకుంటూ.. 16 గంటలు ఉపవాసం ఉండడమన్నమాట!

⚛ ఇక లంచ్‌లో భాగంగా.. రోటీ/పరాఠా, పనీర్‌ మఖానీ, గుజరాతీ దాల్‌, బెండకాయ మసాలా కూర, దాల్‌ మఖానీ, పాలక్‌ పనీర్‌, మెంతికూర పప్పు.. వంటివి తీసుకుంటుందట ఈ ముద్దుగుమ్మ.

⚛ ఎంత బిజీగా ఉన్నా రాత్రి ఏడు లేదా ఎనిమిదింటికల్లా డిన్నర్‌ పూర్తి చేసేస్తుందట జాన్వీ. ఈ క్రమంలో ‘రెడ్‌ రైస్‌ బిర్యానీ’కి ఎక్కువ ప్రాధాన్యమిస్తానంటోంది. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణమట!

⚛ జాన్వీ ఐస్‌క్రీమ్స్‌, చాక్లెట్స్‌ లవర్‌! అయితే వీటినీ మితంగానే తింటానంటోందీ ముద్దుగుమ్మ.

⚛ ఇక తనకు బాగా నచ్చిన విదేశీ వంటకాల్లో స్పైసీ కొరియన్‌ నూడుల్స్‌, జపనీస్‌ ‘Shirataki noodles’ ముందు వరుసలో ఉంటాయంటోందీ భామ. ఒక రకమైన దుంపతో తయారయ్యే ఈ నూడుల్స్‌ రుచిలోనే కాదు.. ఆరోగ్యంలోనూ మేటేనట!

⚛ పిలాటిస్‌, జాగింగ్‌, ఈత, కార్డియో, బరువులెత్తడం.. వంటి వ్యాయామాలు ఎక్కువగా సాధన చేస్తుందట జాన్వీ. ఇవి తన శరీరాన్ని ఫిట్‌గా ఉంచుతూనే, ఆరోగ్యాన్ని-చురుకుదనాన్ని అందిస్తాయని చెబుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్