ఈ కిచెన్‌ టిప్స్.. మీ కోసమే!

ఇంటి వద్ద మనం ఎక్కువగా శ్రమించేది వంటగదిలోనే. ఈ క్రమంలో తరచుగా కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొంటుంటాం. ఈ క్రమంలో వంటగదిలో ఉపయోగపడే కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందామా....

Published : 30 Mar 2024 19:10 IST

ఇంటి వద్ద మనం ఎక్కువగా శ్రమించేది వంటగదిలోనే. ఈ క్రమంలో తరచుగా కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొంటుంటాం. ఈ క్రమంలో వంటగదిలో ఉపయోగపడే కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందామా...

గుడ్డు పెంకు సులభంగా రావాలంటే...
సాధారణంగా కోడిగుడ్లను నేరుగా చల్లటి నీళ్లలో వేసి ఉడకబెడుతుంటాం. కానీ, ఇలా చేయడం వల్ల ఆ తర్వాత పెంకు తీయడం కష్టమవుతుంది. దీనికి బదులు నీళ్లు కొద్దిగా వేడయ్యాక వాటిలో గుడ్లు వేసి ఉడకబెట్టడం వల్ల పెంకులు సులభంగా వస్తాయి. అయితే ఇందులో వెనిగర్ లేదా బేకింగ్ సోడా కలిపితే మంచి ఫలితం ఉంటుంది.

ఆకుకూరలు తాజాగా ఉండాలంటే..
ఆకుకూరలు తాజాగా ఉంటేనే రుచిగా ఉంటాయి. వీటిని గది ఉష్ణోగ్రతలో ఉంచితే ఒక్కరోజులోనే వాడిపోతుంటాయి. ప్రత్యేకించి వేసవిలో కొన్ని ఆకుకూరలు ఫ్రిజ్‌లో పెట్టినా తాజాదనం కోల్పోతుంటాయి. ఈ క్రమంలో ఆకుకూరలను కట్ చేసి ఐస్‌క్యూబ్‌ ట్రేలో వేసి నీళ్లు పోసి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇలా చేయడం వల్ల అవి తాజాగా ఉండడంతో పాటు అందులోని పోషకాలు అలాగే ఉంటాయి.

నట్స్
నట్స్‌లో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. అందుకే వీటిని ఆహారంలో భాగం చేసుకుంటాం. అయితే కొన్ని రకాల నట్స్‌పై పెంకు లాంటి పదార్థం ఉంటుంది. అవి ఉన్నప్పుడు అందులోని పోషకాలు అలాగే ఉంటాయి. కానీ, మార్కెట్‌కి వచ్చేటప్పుడు చాలావరకు పైభాగాన్ని తొలగించి అమ్ముతుంటారు. నట్స్‌ గట్టిగా ఉండడంతో చాలామంది వాటిని గది ఉష్ణోగ్రత వద్దే ఉంచుతారు. దాంతో అందులోని పోషకాలు బయటకు పోతుంటాయి. దీనికి బదులుగా వాటిని ఫ్రిజ్‌లో స్టోర్‌ చేస్తే ఎక్కువ రోజులు ఉండడంతో పాటు అందులోని పోషకాలు కూడా భద్రంగా ఉంటాయి.

ఉల్లిగడ్డను కోయండిలా..
ఉల్లిగడ్డలు కట్‌ చేయాలంటే కన్నీరు పెట్టాల్సిందే. కళ్లల్లో నీళ్లు రాకుండా ఉండేందుకు కొంతమంది రకరకాల పద్ధతులు పాటిస్తుంటారు. అయితే దీనికి ఒక సులభమైన చిట్కా ఉంది. ఉల్లిగడ్డలు కోయడానికి అరగంట ముందు వాటిని ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆ తర్వాత వాటిని కోస్తే కన్నీళ్లు రావు. ఎందుకంటే చల్లగా ఉండే ఉల్లిగడ్డల్లో కన్నీళ్లకు కారణమయ్యే ఎంజైమ్‌లు నెమ్మదిగా విడుదలవుతుంటాయి.

వంటపాత్రలు తళతళలాడాలంటే..
కొన్ని పాత్రలు ఎంత శుభ్రం చేసినా అలానే ఉంటుంటాయి. ఇలాంటప్పుడు ఒక టబ్‌లో నీళ్లు పోసి అందులో కొంచెం వెనిగర్ కలపాలి. వాటిలో వంట పాత్రలను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే శుభ్రం చేస్తే పాత్రలు తళతళ మెరుస్తుంటాయి.

ఇవి కూడా...
 చెక్కతో చేసిన చాపింగ్‌ బోర్డ్‌ కొన్ని సందర్భాల్లో వాసన వస్తుంటుంది. ఇలాంటప్పుడు బోర్డ్‌పై రాక్‌ సాల్ట్‌ వేసి పదిహేను నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత అర చెక్క నిమ్మకాయతో రుద్ది కడగాలి. వాసన పోతుంది.
 చెక్కతో తయారు చేసిన స్పూన్లను చాలా సులభంగా శుభ్రం చేయచ్చు. ఇందుకోసం వాటిని కొద్దిసేపు వేడి నీళ్లలో మరిగించి ఎండలో ఆరబెడితే చాలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్