ఒకే బుట్ట... ఎనిమిది రకాల్లో..!

వంటగది అందమంతా సర్దుకోవడంలోనే ఉంటుంది కదా! అందుకే దానికి ఉపయోగపడే వస్తువులు రకరకాల డిజైన్లలో మార్కెట్లోకి వచ్చేశాయి. మీరూ చూసేయండి. ఒక్కోసారి ఇంట్లో కూరగాయలు, పండ్లు లాంటివి ఎక్కువగా ఉండిపోతుంటాయి. చిన్న బాస్కెట్లు అయితే సరిపోవు. అలా అని మరీ పెద్దవి ఇంట్లో పెట్టుకోలేం కదా! అలాంటప్పుడు ఉపయోగపడేలా ఈ ‘ఫోల్డబుల్‌ మల్టీపర్పస్‌ స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ బాస్కెట్‌’ను తెచ్చేసుకోండి.

Published : 29 May 2024 03:45 IST

స్మార్ట్‌ కిచెన్‌

వంటగది అందమంతా సర్దుకోవడంలోనే ఉంటుంది కదా! అందుకే దానికి ఉపయోగపడే వస్తువులు రకరకాల డిజైన్లలో మార్కెట్లోకి వచ్చేశాయి. మీరూ చూసేయండి. 

కావాల్సిన సైజులో..

క్కోసారి ఇంట్లో కూరగాయలు, పండ్లు లాంటివి ఎక్కువగా ఉండిపోతుంటాయి. చిన్న బాస్కెట్లు అయితే సరిపోవు. అలా అని మరీ పెద్దవి ఇంట్లో పెట్టుకోలేం కదా! అలాంటప్పుడు ఉపయోగపడేలా ఈ ‘ఫోల్డబుల్‌ మల్టీపర్పస్‌ స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ బాస్కెట్‌’ను తెచ్చేసుకోండి. సరకు పరిమాణానికి తగినట్లు దీని పొడవు, వెడల్పులను మార్చుకోవచ్చు. డైనింగ్‌ టేబుల్, సెంటర్‌ టేబుల్, స్పూన్‌ హోల్డర్‌గా, ప్లేట్ల స్టాండుగా, ఆఫీసులోనూ మొత్తం 8 రకాల ఆకృతుల్లో దీన్ని ఉపయోగించుకోవచ్చు. స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో తయారుచేసింది కాబట్టి ఎక్కువకాలం మన్నుతుంది కూడా.


ఎన్ని గుడ్లు అయినా సర్దేయొచ్చు..

వేసవికాలంలో గుడ్లను ఎక్కువ రోజులు బయట ఉంచలేం కదా! మరి అవన్నీ ఫ్రిజ్‌లో పెట్టాలంటే చోటు సరిపోదు. డబ్బాల్లాంటి వాటిలో పెట్టాలంటే పగులుతాయనే భయం. అందుకే ఈ ఎగ్‌ స్టోరేజీ బాక్సులు తెచ్చుకోండి. అరలుగా అమరి ఉండే వీటిల్లో రెండు మూడు డజన్ల గుడ్లను కూడా అందంగా సర్దుకోవచ్చు. ఫ్రిజ్‌ అంతా గజిబిజిగా లేకుండానూ ఉంటుంది. పైగా ఫ్రిజ్‌లో ఉన్న చోటుని బట్టి ఎక్కడైనా ఉంచేలా ఆటో రీఫిల్, ఎగ్‌ డ్రాయర్‌ బాక్సులు, స్కెల్టర్, ట్రే, ర్యాక్స్‌... లాంటి రకరకాల డిజైన్లలో ఇవి అందుబాటులో ఉన్నాయి.


సాయంకాలం సరదాగా...

సెలవు రోజుల్లో, సాయంకాలాల్లో ఇంట్లో అందరం కూర్చొని చిరుతిళ్లు, పండ్లు, నట్్స లాంటివి తింటాం కదా! ఒక్కోసారి మూవీ నైట్స్‌ కూడా ప్లాన్‌ చేసుకుంటాం. అలాంటప్పుడు తినుబండారాలన్నీ ఒకేచోట ఉండేలా ఈ స్నాక్‌ స్టోరేజి బాక్సును తెచ్చుకోండి. చక్కగా సర్వింగ్‌ ట్రేలానూ ఉపయోగపడుతుంది. ఇందులో రెండు లేయర్లుగా 10గ్రిడ్‌లు ఉంటాయి. ఒక్కోదాన్లో ఒక్కో స్నాక్‌ నింపుకోవచ్చు. ఫోన్, ట్యాబ్‌ లాంటివీ దానిపైనే ఉంచుకునేలా అమరిక ఉంటుంది. అవసరమైతే దీన్నే జ్యుయెలరీ, కాస్మెటిక్‌ వస్తువుల కోసమూ వినియోగించుకోవచ్చు.  

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్