ఆ మాటే కిక్‌ ఇచ్చింది!

ఆర్థిక సంబంధ విషయాల్లో ఆడవాళ్లకు చాలాసార్లు ‘ఇది మగవారి పని! డబ్బు విషయాలు మీకెందుకు’ లాంటి సలహాలొస్తుంటాయి.

Published : 31 Jan 2023 00:22 IST

ర్థిక సంబంధ విషయాల్లో ఆడవాళ్లకు చాలాసార్లు ‘ఇది మగవారి పని! డబ్బు విషయాలు మీకెందుకు’ లాంటి సలహాలొస్తుంటాయి. దీన్నో బ్రహ్మపదార్థంలా చూపిస్తుంటారు. దీంతో చాలామంది పట్టించుకోవద్దు అనగానే ‘హమ్మయ్య! భారం తీరింది’ అనుకుంటారు. అదే పొరపాటు. 20 ఏళ్ల క్రితం ఆర్థిక రంగంలోకి ప్రవేశించినప్పుడు ‘ఇది నీకు తగదు, మగవాళ్ల పని’ అంటూ నాకూ బోలెడు సలహాలొచ్చాయి. 9-5గం. పని చూసుకోమన్నవారూ ఉన్నారు. మామూలుగా అయితే తక్కువమంది ఉండే రంగంలోకి వెళ్లాలంటే భయమేస్తుంది. తగని ప్రదేశంలో ఉన్నామేమో అని కంగారూ పడతాం. నా విషయంలో మాత్రం అలాకాదు. ఈ రంగం తగదు, అమ్మాయిలు లేరన్న మాటే నాకు కిక్‌ ఇచ్చింది. కష్టమో, నష్టమో.. నాకాసక్తి ఉంది, నచ్చింది.. అలాంటప్పుడు ఎవరో భయపెట్టారని ఎందుకు వెనకడుగు వేయాలనుకున్నా. అలా దేశంలో బాండ్‌ మార్కెట్‌లోకి ప్రవేశించిన తొలి మహిళనయ్యా. ఆర్థికరంగమనే కాదు.. ఏదైనా ఆకర్షించిందా.. ప్రయత్నించేయండి. తక్కువమంది ఉన్నారన్న మాటకి భయపడొద్దు. ఉద్యోగిని, గృహిణి.. ఎవరైనా ఆర్థిక పాఠాలు నేర్చుకోవచ్చు. దాన్నో మోయలేని బాధ్యత అనుకొని మగవారికే వదిలేయొద్దు. ‘నేను ఎందుకు చేయలేను’ అని సవాలులా తీసుకోండి. ఆర్థిక పాఠాలు నేర్వండి. ఆత్మవిశ్వాసం, స్వేచ్ఛ అవగాహనకు వస్తాయి.

- లక్ష్మీ అయ్యర్‌, సీఈఓ, కొటక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్స్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్