Kriti Sanon: ఎప్పటికైనా అక్కడికి వెళ్లాలనుంది!

సవాలుతో కూడిన పాత్రలు ఎంచుకోవడంలో ముందుంటుంది బాలీవుడ్‌ అందాల తార కృతీ సనన్‌. ఈ క్రమంలో బరువు పెరగడానికి, తగ్గడానికి, డీ-గ్లామరస్‌గా నటించడానికీ వెనకాడదామె. సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. వీలు చిక్కినప్పుడల్లా తన అభిమానులతో....

Published : 01 Apr 2023 19:59 IST

(Photos: Instagram)

సవాలుతో కూడిన పాత్రలు ఎంచుకోవడంలో ముందుంటుంది బాలీవుడ్‌ అందాల తార కృతీ సనన్‌. ఈ క్రమంలో బరువు పెరగడానికి, తగ్గడానికి, డీ-గ్లామరస్‌గా నటించడానికీ వెనకాడదామె. సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. వీలు చిక్కినప్పుడల్లా తన అభిమానులతో ముచ్చటిస్తుంటుంది కూడా! ఈ నేపథ్యంలోనే ఇటీవలే ఇన్‌స్టా వేదికగా ‘ఆస్క్‌ మీ ఎనీథింగ్‌’ సెషన్‌ నిర్వహించింది కృతి. తన వ్యక్తిగత జీవితం గురించి అభిమానులు అడిగిన పలు ఆసక్తికర ప్రశ్నలకు సరదాగా సమాధానమిచ్చింది. మరి, త్వరలోనే ‘ఆదిపురుష్‌’ చిత్రంతో సీతగా అలరించనున్న ఈ చక్కనమ్మ పంచుకున్న ఆ విశేషాలేంటో మనమూ చదివేద్దాం రండి..!

☛ అభిమాని : పానీ పూరీ, వడాపావ్‌.. ఈ రెండింట్లో ఏదంటే ఇష్టం?

కృతి : పానీ పూరీ. నేను దీన్ని గోల్‌ గప్పే అని పిలిచేదాన్ని. కానీ ముంబయిలో స్థిరపడ్డాక పానీ పూరీ అని పిలవడం ప్రారంభించా. ఏదేమైనా.. నాకిప్పుడు పానీ పూరీ తినాలనుంది.. (నవ్వుతూ)

☛ కాఫీ స్ట్రాంగ్‌గా తాగుతారా?

మరీ అంత స్ట్రాంగ్‌గా, మరీ అంత పల్చగా కాకుండా.. మధ్యస్తంగా ఉంటే ఇష్టపడతా. చేదుగా ఉన్నా నచ్చదు.

☛ ఎప్పటికైనా వెళ్లాలనుకుంటున్న ప్రదేశం?

కేప్‌టౌన్‌లో షూటింగ్‌ జరగాలని కోరుకుంటున్నా. అలాగే గ్రీస్‌లోనూ! నిజానికి ఎప్పటికైనా గ్రీస్‌ వెళ్లాలన్న కోరిక ఉంది. అది అంత అందమైన ప్రదేశం మరి!

☛ టీనేజర్లకు మీరిచ్చే సౌందర్య చిట్కాలు?

చర్మ సౌందర్యం విషయంలో మనం పాటించే రొటీన్‌ ఎంత స్థిరంగా కొనసాగిస్తే అంత మంచి ఫలితం ఉంటుంది. కాలమేదైనా రోజూ సన్‌స్క్రీన్‌ లోషన్‌ తప్పనిసరి. అది మీ చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అలాగని అతిగా చిట్కాలు పాటించడమూ మంచిది కాదు. ఏదైనా బ్యాలన్స్‌డ్‌గా ఉండేలా జాగ్రత్తపడడం ముఖ్యం.

☛ మానసిక ప్రశాంతత కోసం.. ఓ చిట్కా?

అతిగా ఆలోచించడం మానుకోండి. ఇందుకోసం ఎప్పుడూ పనిలో మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవాలి. నేనైతే ఇలాగే చేస్తా. మనసు తేలికవుతుంది.

☛ జుట్టు పొడవుగా ఉంటే ఇష్టమా? లేదంటే పొట్టిగానా?

నాకు పొడవైన జుట్టంటేనే ఇష్టం. కానీ అప్పుడప్పుడూ పొట్టిగా కత్తిరించుకోవాల్సి వస్తుంది. అప్పుడు చాలా బాధపడతా.

☛ ‘ఆదిపురుష్‌’ గురించి ఒక్కమాటలో..?

ఇదో అద్భుతమైన అనుభవం.. ప్రతి సన్నివేశాన్నీ ఎంజాయ్‌ చేశా.. మీలాగే నేనూ విడుదల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా.

☛ జయాపజయాల్ని మీరెలా స్వీకరిస్తారు?

విజయాన్ని తలకెక్కించుకోను.. అలాగని ఓటమికి బాధపడను.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్