అది ఒక అపోహే!

రెండో ప్రెగ్నెన్సీ! మాతృత్వ సెలవుల్లో ఉన్నప్పుడు వ్యాపార ఆలోచన వచ్చింది. అసలే మధ్యతరగతి అమ్మాయిని. ప్రతి అడుగూ ఆచితూచి వేయాలి. ప్రతి రూపాయికీ విలువ దక్కాలని సహజంగానే ఆలోచిస్తా. వచ్చిన చిక్కల్లా.. నా సమయాన్ని కోరుకునే పిల్లలు ఒకవైపు. ప్రతి దశలో ఆలోచనలు అవసరమయ్యే కొత్త వ్యాపారం.

Published : 18 Jan 2023 00:17 IST

 

రెండో ప్రెగ్నెన్సీ! మాతృత్వ సెలవుల్లో ఉన్నప్పుడు వ్యాపార ఆలోచన వచ్చింది. అసలే మధ్యతరగతి అమ్మాయిని. ప్రతి అడుగూ ఆచితూచి వేయాలి. ప్రతి రూపాయికీ విలువ దక్కాలని సహజంగానే ఆలోచిస్తా. వచ్చిన చిక్కల్లా.. నా సమయాన్ని కోరుకునే పిల్లలు ఒకవైపు. ప్రతి దశలో ఆలోచనలు అవసరమయ్యే కొత్త వ్యాపారం. సరిగా ప్లాన్‌ చేసుకుంటే రెండింటి సమన్వయం సులువే అనుకుంటాం కానీ.. అదో అపోహే! ఇవే కాదు.. మనకు కూతురు, కోడలు, భార్య, స్నేహితురాలు.. వంటి అదనపు బాధ్యతలెన్నో. పుట్టినరోజులు మర్చిపోవడం, చెప్పిన సమయానికి రాలేక పోవడం, వాళ్లతో కాసేపు గడపలేకపోవడం.. సహజంగా జరిగేవే. అయితే మరచిపోయిన సంగతి గ్రహించాక వాళ్ల ప్రశ్నించే చూపుల కంటే ముందే మనసు అపరాధ భావంతో నిండిపోతుంది. దీంతో ఒత్తిడీ మామూలుగా ఉండదు. ఫలితమే కెరియర్‌ కన్నా కుటుంబం ముఖ్యమనుకోవడం. పోనీ అదైనా ప్రశాంతంగా ఉండనిస్తుందా అంటే.. ఏమీ చేయలేకపోతున్నామనే బాధ. అందుకే నేను అనుసరించిన మంత్రం.. అన్ని పనులూ మీదేసుకోకపోవడం. అమ్మానాన్న, అత్తమామలు, మావారు.. మొహమాటం లేకుండా వీళ్ల సాయం కోరా. ఉదయం పిల్లలను సిద్ధం చేయడం, స్కూలుకు పంపడం, మధ్యలో పని.. రాత్రి కాసేపు కుటుంబంతో గడపడం, ఆటలు, వారిని నిద్రపుచ్చడం.. ఏదైనా ఓ రోజు కుదరక పోయినా ముందుగానే వాళ్లకు చెప్పేసే దాన్ని. దీంతో అర్థం చేసుకోవడం అలవాటైంది. మరి నేను? రోజంతా ఉరుకులు, పరుగులే! అలసిపోతా.. కాకపోతే నచ్చి చేస్తున్నా కదా.. దానిలోనూ ఆనందమే. మీరైనా అంతే.. చేసే పని నచ్చకపోతే సరే. ఇష్టమైన దాన్ని సమస్య వచ్చిందని వదిలేయొద్దు. పరిష్కారం కోసం ఆలోచించండి. ఏదో ఒక దారి తప్పక దొరుకుతుంది. ఓపిగ్గా వెతకాలంతే.

- సుచీ ముఖర్జీ, సీఈఓ, లైమ్‌రోడ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్