తడిసిన చెప్పులు, బూట్ల కోసం..!

ఈ వర్షానికి చెప్పులు/షూస్‌/బూట్లు తడిస్తే ఓ పట్టాన ఆరవు. అలాగని రోజూ ధరించే చెప్పులు జతల కొద్దీ మన దగ్గర ఉండచ్చు.. ఉండకపోవచ్చు. అయితే ఇలా చెప్పులు తడిసినప్పుడు చాలామంది వాటిని గోడకు లేదంటే షూ ర్యాక్కు ఏటవాలుగా ఆనించి....

Updated : 30 Sep 2022 20:44 IST

ఈ వర్షానికి చెప్పులు/షూస్‌/బూట్లు తడిస్తే ఓ పట్టాన ఆరవు. అలాగని రోజూ ధరించే చెప్పులు జతల కొద్దీ మన దగ్గర ఉండచ్చు.. ఉండకపోవచ్చు. అయితే ఇలా చెప్పులు తడిసినప్పుడు చాలామంది వాటిని గోడకు లేదంటే షూ ర్యాక్కు ఏటవాలుగా ఆనించి పెడుతుంటారు. దీనివల్ల ఒక్కోసారి అవి వంగిపోతుంటాయి. మరుసటి రోజు వాటిని వేసుకుంటే అసౌకర్యంగా అనిపించడమే కాదు.. షూస్‌ లాంటివైతే తడి పూర్తిగా ఆరనందువల్ల ఒక రకమైన వాసన వస్తుంటాయి. ఈ సమస్యను పరిష్కరించడానికే ఇప్పుడు మార్కెట్లోకొచ్చేశాయి ‘షూ డ్రైయింగ్‌ ర్యాక్స్‌/హోల్డర్స్’.

స్టాండ్స్‌, గోడలకు అమర్చుకునేలా ఉండే వాల్‌ మౌంటెడ్‌ ర్యాక్స్‌, తీగలకు వేలాడదీసే హ్యాంగర్స్‌ మాదిరిగా ఉండేవి.. ఇలా విభిన్న రకాల షూ డ్రయర్స్‌ని డిజైనర్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. తడిసిన చెప్పుల్ని ఆయా స్టాండ్స్‌ ఆకృతికి తగినట్లుగా వేలాడదీయడం, అందులో నిలువుగా ఉంచడం.. చేస్తే అవి సులభంగా ఆరిపోతాయి.

ఇక బాత్‌రూమ్‌లో చెప్పులు ఉపయోగించే వారు ఇలాంటి ర్యాక్స్‌ని వాష్‌రూమ్‌ డోర్‌కి ఏర్పాటుచేసుకుంటే.. వాటిని వాడడం, తిరిగి స్టాండ్‌లో అమర్చడం సులువవుతుంది.. ఆ ప్రదేశం నీట్‌గానూ ఉంటుంది.

ఇవన్నీ కాదు.. మాకు షూస్‌ త్వరగా ఆరిపోవాలి.. అంటారా? అందుకూ ‘ఎలక్ట్రిక్‌ పోర్టబుల్‌ షూ డ్రయర్స్‌’ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని రీఛార్జ్‌ చేసుకుంటూ వాడుకోవచ్చు. మరి, చెప్పుల్ని ఆరబెట్టేందుకు వీలుగా ఉన్న ఈ షూ స్టాండ్స్‌/ర్యాక్స్‌పై మీరూ ఓ లుక్కేయండి!

Photos: Amazon.in

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్