ఈ అద్భుతాన్ని తినేయొచ్చు!

ఇటలీలోని మిలాన్‌ కేథడ్రల్‌ నిర్మాణానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ చర్చి నిర్మాణానికి ఆరు శతాబ్దాలు పట్టింది. ఇంత సుదీర్ఘకాలం సాగిన ఈ నిర్మాణాన్ని సృజనకి ప్రతిరూపంగా భావిస్తారంతా.

Published : 09 Mar 2023 01:13 IST

ఇటలీలోని మిలాన్‌ కేథడ్రల్‌ నిర్మాణానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ చర్చి నిర్మాణానికి ఆరు శతాబ్దాలు పట్టింది. ఇంత సుదీర్ఘకాలం సాగిన ఈ నిర్మాణాన్ని సృజనకి ప్రతిరూపంగా భావిస్తారంతా. అందుకే ఆ నిర్మాణాన్ని తన బేకింగ్‌ ప్రతిభను నిరూపించుకోవడానికి ఎంచుకుంది పుణెకి చెందిన ప్రముఖ బేకింగ్‌ నిపుణురాలు ప్రాచీదేవ్‌. 100 కేజీల రాయల్‌ ఐసింగ్‌ షుగర్‌తో, 1500 తినే విడిభాగాలతో ఈ చర్చ్‌ నకలుని తయారుచేసిందీ అమ్మాయి. నెలరోజులు కష్టపడి అచ్చంగా మిలాన్‌ ప్రతిరూపంలా తయారుచేసిన ఈ కేక్‌ పాలు, పాల ఉత్పత్తులు వాడకుండా... అచ్చంగా వీగన్‌ పద్ధతిలో తయారు చేసింది. అతిపెద్ద రాయల్‌ ఐసింగ్‌ కేక్‌ని చేసి ప్రపంచ రికార్డుని కొట్టేసిందీ కన్‌ఫెక్షనరీ క్వీన్‌. ప్రపంచ ప్రసిద్ధ నిర్మాణాలని ఇలా కేకులుగా రూపొందించడంలో పేరొందిన ప్రాచీ... గతంలో ప్రముఖ భారతీయ రాజప్రాసాదాలని ఇలానే రూపొందించింది. కోల్‌కతా విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పుచ్చుకొన్న ప్రాచీ మొదట్లో ఫైనాన్షియల్‌ అనలిస్ట్‌గా పనిచేసింది. మంచి జీతం వచ్చే ఆ ఉద్యోగం కన్నా సంతృప్తినిచ్చే ఈ వృత్తినే కొనసాగిస్తూ ప్రపంచ రికార్డులు బద్దలు కొడుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్