Rani Rampal: రాణీ పేరు పెట్టారు!

విరిగిపోయిన హాకీ స్టిక్స్‌తో సాధన చేసి.. ఒక్కపూట భోజనానికి ఇబ్బందులు పడ్డ పేదింటి అమ్మాయి పేరుని ఒక స్టేడియంకే పెట్టడం అంటే గొప్ప విషయమే కదా! ఆ అమ్మాయి ఎవరో కాదు హాకీ క్రీడాకారిణి రాణీరాంపాల్‌...

Updated : 27 Mar 2023 00:15 IST

మొదటిసారి

విరిగిపోయిన హాకీ స్టిక్స్‌తో సాధన చేసి.. ఒక్కపూట భోజనానికి ఇబ్బందులు పడ్డ పేదింటి అమ్మాయి పేరుని ఒక స్టేడియంకే పెట్టడం అంటే గొప్ప విషయమే కదా! ఆ అమ్మాయి ఎవరో కాదు హాకీ క్రీడాకారిణి రాణీరాంపాల్‌...

ద్మశ్రీ వంటి అత్యుత్తమ పురస్కారాలెన్నింటినో అందుకున్న హాకీ క్రీడాకారిణి రాణీ రాంపాల్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఎమ్‌సీఎఫ్‌ రాయ్‌ బరేలీ హాకీ స్టేడియం పేరుని తాజాగా ‘రాణీస్‌ గర్ల్స్‌ హాకీ టర్న్‌’గా మార్చారు. ఒక స్టేడియంకి ఇలా క్రీడాకారిణి పేరుని పెట్టడం ఇదే మొదటిసారి. హరియాణాకు చెందిన రాణి 15వ ఏటనే జాతీయస్థాయి మహిళా హాకీ జట్టులో అతి పిన్నవయస్కురాలైన క్రీడాకారిణిగా నిలిచింది. దేశం తరఫున 250 అంతర్జాతీయస్థాయి పోటీల్లో తన సత్తా చాటి, 134 గోల్స్‌ సాధించింది. 2017లో విమెన్స్‌ ఆసియా కప్‌ కైవసం చేసుకొన్న భారతీయ మహిళా హాకీ టీంలో ఈమె ఒకరు. కెప్టెన్‌గా ఎన్నో విజయాల్ని సాధించింది. ‘నా సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. ఇలాంటి అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న తొలి మహిళాక్రీడాకారిణి కావడం గర్వంగా ఉంది. ఈ విజయాన్ని జట్టుకే అంకితమిస్తున్నా. రాబోయే క్రీడాకారిణులకు ఇదెంతో స్ఫూర్తినందిస్తుంది’ అంటోంది రాణీ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్