దుమ్ముతో తిప్పలా?

పండగ వేళ.. ఇల్లంతా మెరిసేలా చేస్తాం. అసలే దుమ్ముతో పని! తుమ్ములు, దగ్గు.. అలర్జీల సమస్యలా? ఈ చిట్కాలను పాటించేయండి.

Published : 12 Jan 2023 00:47 IST

పండగ వేళ.. ఇల్లంతా మెరిసేలా చేస్తాం. అసలే దుమ్ముతో పని! తుమ్ములు, దగ్గు.. అలర్జీల సమస్యలా? ఈ చిట్కాలను పాటించేయండి.

గోరువెచ్చని నీటిలో తేనె కలిపి, రోజుకు రెండు మూడు సార్లు తాగండి. ఉపశమనం దొరుకుతుంది. దుమ్ము కాస్త లోపలికి వెళ్లిందంటే తుమ్ములు మొదలవుతాయి కొందరిలో! నిమ్మ, సిట్రస్‌ ఫలాలను ఎక్కువగా తీసుకోండి. వీటిల్లోని విటమిన్‌ సి అలర్జీలను దూరం చేస్తుంది. ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి సమస్యను అదుపులోకి తెస్తుంది. గుమ్మడిలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లూ దగ్గు నుంచి ఉపశమనమిస్తాయి.

* పుదీనా ఆకులతో టీ చేసుకొని రోజులో మూడుసార్లు తాగండి. ఇందులో పంచదారకు బదులుగా బెల్లం లేదా తేనె వేసుకోవాలి. కాస్త నిమ్మరసమూ చేర్చుకుంటే రుచి బాగుంటుంది. పుదీనాలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, మెంతాల్‌ గుణాలు తుమ్ములు, ముక్కు దురద వంటివి తగ్గిస్తాయి. దుమ్ము కారణంగా వచ్చే తుమ్ములు, ముక్కు కారడాన్నీ తగ్గిస్తాయి.

* యూకలిప్టస్‌ ఆయిల్‌లో యాంటీ మైక్రోబియల్‌ గుణాలుంటాయి. ఇది తుమ్ములనే కాదు.. ఆగకుండా వచ్చే దగ్గు నుంచీ ఉపశమనం కలిగిస్తుంది. అర స్పూను కొబ్బరి నూనెలో 3, 4 చుక్కల యూకలిప్టస్‌ ఆయిల్‌ కలిపి గొంతు, గుండె మీద రాస్తే సరి. వేడి నీటిలో కొన్ని చుక్కలు వేసి, ఆవిరి పీల్చినా ఉపశమనం ఉంటుంది.

* అలర్జీ లక్షణాలు కనిపించినప్పుడు ఆహారంలో ఎక్కువ మొత్తంలో నెయ్యిని చేర్చుకోండి. దీనిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా సమస్యను తగ్గిస్తాయట. అయితే కళ్లు తిరగడం, గుండెల్లో నొప్పిలా అనిపించడం, విపరీతమైన కళ్ల మంట వంటివి ఉంటే మాత్రం వైద్యులను సంప్రదించడం తప్పనిసరి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్