Updated : 17/01/2023 00:22 IST

ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు?!

నాకిప్పుడు 28 ఏళ్లు. ఈ ఏడాది గెలవకపోతే.. వచ్చే ఏడాది అందాల పోటీల్లో పాల్గొనే అవకాశం ఉండేది కాదు. అలాగని గెలవకపోతే ఎలా అని ఎప్పుడూ భయపడలేదు. నాకు ప్రస్తుతమే ముఖ్యం. ‘ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు?’ నా సూత్రమిది! ఇప్పుడు, ఈరోజు ఏం చేస్తున్నానన్నదే నాకు ప్రధానం. 2020 ‘మిస్‌ కీమా’ పోటీల్లో మొదటిసారి పాల్గొన్నా. టాప్‌ 5 వరకూ చేరా. 2021 మిస్‌ టెక్సాస్‌ యూఎస్‌ఏ పోటీల్లో రెండో స్థానంలో నిలిచా. 2022లో కిరీటాన్ని దక్కించుకున్నా. ఓటమిని మాత్రమే పట్టించుకున్నా, అసలు ఈ స్థానానికి వెళ్లగలనా అని సందేహించినా అక్కడే ఆగిపోయే దాన్ని. ప్రత్యేకంగా నిలవాలని ఆలోచిస్తా కాబట్టే.. మిస్‌ యూఎస్‌ఏ, మిస్‌ యూనివర్స్‌గా నిలిచిన తొలి ఫిలిప్పినా-అమెరికన్‌ని అయ్యా. అమ్మ అమెరికన్‌, నాన్నది ఫిలిప్పీన్స్‌. ఆశావహధోరణితో ముందుకెళ్లా కాబట్టే ఈ స్థానంలో నిలిచా. ఇదే కాదు... నేనో వాలీబాల్‌ క్రీడాకారిణిని. 15 ఏళ్ల వయసులో ఆసక్తి వస్త్రాలపైకి మళ్లింది. అలా ఫ్యాషన్‌ డిజైనర్‌నయ్యా. నలుగురికీ సాయపడాలంటే సమాజ సేవలోకే వెళ్లనక్కర్లేదు. నచ్చిన పనిని పదిమందికీ ఉపయోగపడేలా తీర్చిదిద్దితే చాలు. కాలుష్యాన్ని పెంచే వాటిల్లో ఫ్యాషన్‌ రంగమూ ఒకటి. దాన్ని తగ్గించేలా వృథా వాటితో వస్త్రాలను తీర్చిదిద్దుతున్నా. నా గళాన్ని వినిపించడానికి మోడల్‌నయ్యా. గృహహింస, మానవ అక్రమ రవాణా నుంచి తప్పించుకున్న మహిళలకు దుస్తులు కుట్టడంలో శిక్షణనిస్తున్నా. అమ్మాయిలూ.. నా సలహా ఒక్కటే! ‘కుదురుతుందా? చేయగలనా?’ అనేవి పక్కన పెట్టండి. మిమ్మల్ని ప్రత్యేకంగా నిలిపే అంశాలపై దృష్టిపెట్టండి. మీరెంత దృఢమైన వ్యక్తులో అది పరిచయం చేస్తుంది. దేనికోసమూ నచ్చినదాన్ని పక్కనపెట్టొద్దు. నచ్చింది చేస్తూనే ఇతరులు కోరుకునే ఫలితాలను ఎలా సాధించవచ్చో ప్రయత్నించండి. ముఖ్యంగా.. ఈ క్షణంలో బతకండి. ప్రతి నిమిషాన్నీ ఆస్వాదించండి.

- ఆర్‌ బోనీ గాబ్రియేల్‌, మిస్‌ యూనివర్స్‌ 2022


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి