ఆమె పాట... రోజూ నాలుగు కోట్లసార్లు!

ఇంతవరకూ సంగీత ప్రపంచంలో ఉన్న రికార్డులన్నీ బీటీఎస్‌, బ్లాక్‌పింక్‌ బ్యాండ్‌, టేలర్‌ స్విఫ్ట్‌ వంటివాటి పేరిటే ఉన్నాయి. తాజాగా భారతీయ గాయని అల్కాయాగ్నిక్‌ వారితో పోటీపడుతున్నారు..

Updated : 30 Jan 2023 04:20 IST

ఇంతవరకూ సంగీత ప్రపంచంలో ఉన్న రికార్డులన్నీ బీటీఎస్‌, బ్లాక్‌పింక్‌ బ్యాండ్‌, టేలర్‌ స్విఫ్ట్‌ వంటివాటి పేరిటే ఉన్నాయి. తాజాగా భారతీయ గాయని అల్కాయాగ్నిక్‌ వారితో పోటీపడుతున్నారు..

2022 యూట్యూబ్‌ గ్లోబల్‌ ర్యాంకుల్లో అల్కాదే ప్రథమ స్థానం. ఈమె పాటలను రోజుకి సగటున 4.2 కోట్లసార్లు వీక్షిస్తున్నారట. 2021లో అభిమానులు పదిహేడువందల కోట్లసార్లు ఈమె స్వరాన్ని ఆస్వాదించారు. ఆ ముందూ అలాంటి రికార్డులనే సొంతం చేసుకున్నారామె. దీంతో అల్కా వరుసగా మూడోసారి గిన్నిస్‌ రికార్డులకెక్కారు.

పద్నాలుగేళ్ల వయసులో పాట పాడటం మొదలుపెట్టిన ఆమె... తన సుమధుర గాత్రంతో నాలుగు దశాబ్దాలకుపైగా ప్రేక్షకుల్ని ఓలలాడిస్తూనే ఉన్నారు. అల్కాయాగ్నిక్‌ బాలీవుడ్‌ ప్రముఖ గాయనిగా అందరికీ సుపరిచితమే. తేజాబ్‌లోని ‘ఏక్‌దోతీన్‌’, చైనా గేట్‌లోని ‘చమ్మా చమ్మా’.. ఇలా ఆమె పాటల పూదోటలో ఆణిముత్యాలెన్నో. ఇప్పటివరకూ సినిమాలూ, ఆల్బమ్స్‌తో కలిపి ఇరవై వేలకు పైగా పాటలు పాడారు. ఏడు సార్లు ఉత్తమ నేపథ్య గాయనిగా అవార్డులందుకున్నారు. బాలీవుడ్‌ సంగీత పరిశ్రమలో ఎక్కువ సోలో పాటలు పాడిన రికార్డూ అల్కాదే. తాజాగా 2022 సంవత్సరంలో యూట్యూబ్‌లో అత్యధికంగా స్ట్రీమింగ్‌ అయిన గాయనిగా అరుదైన గుర్తింపు పొందారామె. కోల్‌కతాలోని గుజరాతీ కుటుంబానికి చెందిన ధర్మేంద్ర శంకర్‌, శుభ దంపతుల
కుమార్తె అల్కా. తల్లి శుభ శాస్త్రీయ సంగీత కళాకారిణి కావడంతో బాల్యం నుంచి సంగీతంలో శిక్షణ పొందారు. ఆరవ ఏట ఆల్‌ ఇండియా రేడియోలో పాడగా.. తన గొంతులోని శ్రావ్యతను గుర్తించిన రాజ్‌కపూర్‌ సంగీత దర్శకుడు లక్ష్మీకాంత్‌కు సిఫార్సు చేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్