Nikhat Zareen: ఆ పంచ్ వెనుక.. సీక్రెట్ ఇదే!
‘మాటివ్వడం, దాన్ని నిలబెట్టుకోవడం విజేతల లక్షణం’ అంటుంటారు. ఈ విషయం మరోసారి రుజువు చేసింది తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్. గతేడాది ‘ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్’లో తొలి స్వర్ణం నెగ్గిన నిఖత్.. తాజాగా రెండోసారి ఈ టోర్నీలో బంగారు పతకాన్ని....
‘మాటివ్వడం, దాన్ని నిలబెట్టుకోవడం విజేతల లక్షణం’ అంటుంటారు. ఈ విషయం మరోసారి రుజువు చేసింది తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్. గతేడాది ‘ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్’లో తొలి స్వర్ణం నెగ్గిన నిఖత్.. తాజాగా రెండోసారి ఈ టోర్నీలో బంగారు పతకాన్ని ముద్దాడింది. ప్రస్తుతం దిల్లీలో జరుగుతోన్న ‘ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్’లో 50 కిలోల విభాగంలో పసిడి నెగ్గిన ఈ పంచింగ్ క్వీన్.. తద్వారా మేరీ తర్వాత ఒకటి కంటే ఎక్కువసార్లు ప్రపంచ టైటిల్ నెగ్గిన రెండో భారత బాక్సర్‌గా అవతరించింది.
ఆడపిల్లగా ఈ ఆటను ఎంచుకున్న దగ్గర్నుంచీ ఈ సమాజం నుంచి ఎన్నో విమర్శల్ని ఎదుర్కొని తానీ స్థాయికి చేరిందంటే అందుకు కారణం.. ఆమె కృషి, పట్టుదల, సంయమనమే అని చెప్పచ్చు. బాక్సింగ్‌లోకి ప్రవేశించాలని ఉవ్విళ్లూరే మరెంతోమంది యువతులకు స్ఫూర్తిగా నిలవడమే తన కల అని చెప్పే ఈ పంచింగ్ క్వీన్.. వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా తానెదుర్కొన్న ఆటుపోట్ల గురించి పలు సందర్భాల్లో పంచుకున్న విశేషాలు మీకోసం..
నాన్న స్నేహితుడి ఆలోచనతో..!
నాకు చిన్నప్పట్నుంచి ఆటలంటే చాలా ఇష్టం. ఈ క్రమంలోనే రోజూ ఉదయాన్నే నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ గ్రౌండ్‌కు అథ్లెటిక్స్ సాధన కోసం వెళ్లేదాన్ని. ఓ రోజు మా నాన్న ఫ్రెండ్ నా ప్రాక్టీస్‌ను దగ్గర్నుంచి గమనించారు. ‘నిఖత్‌ను బాక్సింగ్ శిక్షణలో చేర్పించు.. ఏడాది తిరిగే లోగా తనను జాతీయ క్రీడాకారిణిగా తయారుచేస్తా..’ అంటూ ఆయన నాన్నతో చెప్పారు. ఇలా 2009లో (13 ఏళ్ల వయసులో) నా బాక్సింగ్ ప్రయాణం ప్రారంభమైంది. నిజానికి మనం ఎంచుకున్న ఏ జర్నీ కూడా అంత సాఫీగా సాగదు. నా బాక్సింగ్ ప్రయాణం కూడా అంతే! చాలామంది ‘బాక్సింగా? మగాళ్ల ఆట ఆడతావా?’ అంటూ నన్ను నిరుత్సాహపరిచే ప్రయత్నం చేశారు. కొంతమంది సంప్రదాయవాదులు ‘ముస్లిం అమ్మాయిలు పరదా చాటుకే పరిమితం కావాలి..’ అంటూ వెనక్కు లాగేవారు. ఇలాంటి పరిస్థితుల్లో నాన్న నా వైపే నిలిచారు. ‘అవన్నీ పట్టించుకోకు.. నీపై నువ్వు నమ్మకముంచు! ఎందుకంటే ప్రయత్నిస్తే ఏదీ అసాధ్యం కాదు..’ అంటూ ప్రతి క్షణం నన్ను ప్రోత్సహించారు.
చాలా మొండిదాన్ని!
అది బలమో, బలహీనతో తెలియదు కానీ.. నేను చిన్నతనం నుంచి చాలా మొండిదాన్ని. అనుకున్నది సాధించాలన్న పట్టుదల ఎక్కువ! పంచ్ అయినా, మాటైనా పడి ఉండే అలవాటు లేదు. నా ప్రతిభతోనే దాన్ని తిప్పి కొట్టాలని అనుకునేదాన్ని. అయితే నేను బాక్సింగ్ సాధన మొదలుపెట్టిన తొలినాళ్లలో నేనొక్కదాన్నే అమ్మాయిని.. అందరూ అబ్బాయిలే ఉండేవారు. దాంతో వాళ్లతోనే పోటీ పడాల్సి వచ్చేది. ఈ క్రమంలోనే వాళ్లిచ్చిన పంచ్‌ని తిప్పి కొట్టే సమయం కోసం వేచి చూసేదాన్ని. అంతేకానీ.. ఆటలో రాణించలేకపోతున్నానన్న అభద్రతా భావం ఎప్పుడూ నా దరి చేరనివ్వలేదు. ఈ పట్టుదల, పాజిటివిటీనే నన్ను ఈ స్థాయికి చేర్చాయనిపిస్తుంది.
సమయం కోసం వేచి చూశా!
అమెరికన్ బాక్సర్ ముహమ్మద్ అలీ నా స్ఫూర్తి. మేరీకోమ్నూ అంతగానే ఆరాధించా. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఆమె ఒలింపిక్ పతకం గెలిచాకే మన దేశంలో మహిళల బాక్సింగ్‌కు ఆదరణ పెరిగిందని చెప్పచ్చు. అయితే ఒకానొక దశలో పలు వివాదాలు నా ఏకాగ్రతకు కాస్త భంగం కలిగించే ప్రయత్నం చేశాయి. నాలో ప్రతిభ ఉన్నా ఆ సమయంలో సెలక్టర్లు నన్ను పక్కన పెట్టేవారు. అయినా కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందని, నా సత్తా ఏంటో నిరూపించేలా చేస్తుందని సమయం కోసం వేచి చూశా. ఒక్కోసారి ఆలోచిస్తే.. ఈ వివాదాలన్నీ నా మంచికే జరిగాయేమో అనిపిస్తుంది. వీటి మూలంగానే నేను మానసికంగా మరింత దృఢమయ్యా. ఆటపై మరింత పట్టు బిగించా.
ఒలింపిక్ పతకం.. పోలీసు ఉద్యోగం!
నాన్న నన్ను ఈ క్రీడలో ఎంతగా వెన్నుతట్టారో.. నా భవిష్యత్తు గురించి అమ్మ అంతకంటే ఎక్కువగా ఆందోళన పడింది. అందరూ అనే మాటలు విని నన్నెవరూ పెళ్లి చేసుకోరేమోనని భయపడేది. అప్పుడు అమ్మకు నేనే సర్ది చెప్పేదాన్ని. ‘ఒక్కసారి ప్రపంచ ఛాంపియన్షిప్ గెలవనివ్వు.. అబ్బాయిలే నా వెనకాల క్యూ కడతారు!’ అంటూ అమ్మ కళ్లలో ఆనందం నింపేదాన్ని. నిజానికి పెళ్లి నా జీవితాశయం కాదు. ఒలింపిక్స్‌లో బంగారు పతకం నెగ్గడమే నా చిరకాల కోరిక. ఎలాగైనా దాన్ని సాధించి తీరతా. బాక్సింగ్ కాకుండా ఇంకే లక్ష్యాలు లేవా అని అడిగితే.. ఐపీఎస్ ఆఫీసర్ కావాలనుకుంటున్నా. తద్వారా మా జిల్లాలో బాక్సింగ్‌ని మరింత ప్రోత్సహించాలనుకుంటున్నా.
నమ్మకముంటే ఏదైనా సాధించచ్చు!
‘మహిళలే సాటి మహిళల్ని చైతన్యవంతుల్ని చేయగలరు’ అంటుంటారు. ఈ విషయాన్ని నేను బలంగా నమ్ముతాను. ఈ సమాజం నుంచి విమర్శలు ఎదుర్కొన్న అనుభవంతో ఒక్క మాట చెప్తాను. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. దాన్ని పసిగట్టడమే కాదు.. ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలి. అప్పుడే ఏదైనా సాధ్యమవుతుంది. నన్నడిగితే.. ప్రతి మహిళా బాక్సింగ్ నేర్చుకోవడం అవసరమని చెప్తా. ఎందుకంటే అది క్రీడ మాత్రమే కాదు.. ఆత్మరక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే ఆయుధం!
నాలుగు కిలోలు తగ్గా!
రెండోసారి ప్రపంచ ఛాంపియన్షిప్ గెలవడం ఓ గొప్ప అనుభూతి. అందులోనూ ఈసారి తొలిగా 50 కిలోల విభాగంలో పోటీపడ్డా. వచ్చే ఏడాది ఒలింపిక్స్‌కూ ఈ విభాగంలోనే బరిలోకి దిగబోతున్నా. 52 కిలోల నుంచి 50 కిలోలకు తగ్గడం కాస్త కష్టంగానే అనిపించింది. ఇందుకోసం నా అసలు బరువు కంటే నాలుగు కిలోలు తగ్గా. ఈ క్రమంలో కచ్చితమైన ఆహార నియమాలు పాటించా. కఠిన వ్యాయామాలు చేశా. నా తర్వాతి లక్ష్యం ఆసియా క్రీడలు. ఇలా నేను నెగ్గే ప్రతి పతకం వచ్చే ఏడాది ఒలింపిక్స్‌కు నన్ను దగ్గర చేస్తోంది. ఈ కఠోర శిక్షణను ఇలాగే కొనసాగించి ఒలింపిక్స్‌లో బంగారు పతకంతో తిరిగిరావాలనుకుంటున్నా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- పాదాలు పదిలంగా
- స్లిట్... మరింత స్టైల్‌గా!
- చల్లటి పాలతో..!
- Makeup: ఈ పొరపాట్లు వద్దు!
- మ్యాచింగ్ పోట్లీ మస్తుంది!
ఆరోగ్యమస్తు
- అలసట లేకుండా పని చేయాలంటే..!
- కోపాన్ని తగ్గించే శశాంకాసనం!
- పోషకాల ‘పుట్ట’... ఆరోగ్యానికి ‘గొడుగు’
- ఎత్తును బట్టే..!
- Nayanthara : నచ్చిందే తింటా.. నోరు కట్టేసుకోను!
అనుబంధం
- నా ఉత్తరాలు చూసి.. కన్నీళ్లతో హత్తుకున్నారు.. తీరు మార్చుకున్నారు!
- కొలీగ్‌తో రెండో పెళ్లి.. పేరెంట్స్ వద్దంటున్నారు!
- ‘777’ నియమంతో... బంధం బలోపేతం!
- పిల్లలకు ఎలాంటి పుస్తకం కొంటున్నారు..?
- వాళ్ల ప్రేమ నిజమా? నకిలీనా?
యూత్ కార్నర్
- Paris Olympics: అందుకే ఈసారి వీళ్లు ప్రత్యేకం!
- ఒలింపిక్స్ బరిలో... బిహార్ ఎమ్మెల్యే!
- పాపులారిటీ కోసం ప్రాణాలెందుకు రిస్క్‌లో పెడతారు?!
- తెలుగమ్మాయి... బ్రిటన్‌లో మెరిసింది!
- వాళ్లున్నప్పుడు మారిపోతాడు!
'స్వీట్' హోం
- ఏడిపిస్తోంటే... ప్రేమంటున్నారు!
- వర్షాలకు మొక్కలు పాడవకుండా..!
- మొక్కలకు కాఫీ పొడి వేస్తున్నారా?
- తగిలిస్తే... పిల్లి వచ్చే!
- నూరు వరహాలతో నిండుగా
వర్క్ & లైఫ్
- కత్రినా ‘స్లిమ్’ బాడీ.. ఆ సీక్రెట్స్ ఇవే!
- Flower Truck Business: అందమైన పూల బొకేలతో.. లక్షలు సంపాదిస్తూ..!
- బరువెక్కుతున్న తెలుగు రాష్ట్రాలు!
- ఈ అలవాట్లే మనల్ని ధనవంతుల్ని చేస్తాయట!
- కేర్ టేకర్లు... కోట్లలో కావలెను!