కోహ్లీ, షమీకి వీరాభిమాని.. ఇంతకీ ఎవరీ బ్యూటీ?

ప్రపంచకప్‌ సెమీఫైనల్లో షమీ తన బౌలింగ్‌ మాయాజాలంతో కివీస్‌కు చుక్కలు చూపించడమే కాదు.. ఎంతోమంది అమ్మాయిల మనసూ కొల్లగొట్టాడు. ఈ క్రమంలోనే చాలామంది సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తూ ఈ పేసర్‌ను ఆకాశానికెత్తేశారు.

Published : 18 Nov 2023 13:19 IST

(Photos: Instagram)

ప్రపంచకప్‌ సెమీఫైనల్లో షమీ తన బౌలింగ్‌ మాయాజాలంతో కివీస్‌కు చుక్కలు చూపించడమే కాదు.. ఎంతోమంది అమ్మాయిల మనసూ కొల్లగొట్టాడు. ఈ క్రమంలోనే చాలామంది సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తూ ఈ పేసర్‌ను ఆకాశానికెత్తేశారు. అయితే వారిలో ఓ అమ్మాయి పెట్టిన పోస్ట్‌ తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ‘ఎవరా అమ్మాయి?’ అని ఆరా తీస్తే.. ఆమె ఓ విదేశీయురాలని, భారత క్రికెట్‌ జట్టుకు వీరాభిమాని అన్న విషయం స్పష్టమైంది. ముఖ్యంగా కింగ్‌ కోహ్లీని ఎక్కువగా అభిమానించే ఈ ముద్దుగుమ్మకు.. భారతీయ కట్టూ-బొట్టు, ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలన్నా మక్కువేనట! నిజానికి ఇటీవలే ఆసియా కప్‌ జరిగిన సమయంలోనే సోషల్‌ స్టార్‌గా మారిపోయిన ఈ ఫ్యాన్‌ గర్ల్‌ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..

ఏ క్రీడలోనైనా స్వదేశీ జట్టునే కాదు.. విదేశీ జట్లనూ అభిమానించే వారు చాలామందే ఉంటారు. ఏ టోర్నీ జరిగినా ఆసాంతం తమ అభిమాన జట్లకు మద్దతు తెలుపుతుంటారు. ఈ విషయానికొస్తే వజ్మా అయౌబీ పెద్ద క్రికెట్‌ లవర్‌ అని చెప్పచ్చు. ఈమెది అఫ్గానిస్థాన్‌. ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటోంది. తమ జట్టు ఏ దేశంలో, ఏ టోర్నీలో పోటీ పడినా.. అక్కడ వాలిపోతుంటుంది వజ్మా. స్టాండ్స్‌లో కూర్చొని జట్టును ఛీర్‌ చేస్తుంటుంది. అంతేకాదు.. సోషల్‌ మీడియా పోస్ట్‌లతోనూ జట్టుకు తన మద్దతు తెలుపుతుంటుందీ ఫ్యాన్‌ గర్ల్‌.

కోహ్లీ.. నా ఆల్‌ టైమ్‌ ఫేవరెట్‌!

అయితే క్రికెట్‌పై తనకున్న అభిమానంతో ఇప్పటివరకు కొంతమందికి మాత్రమే సుపరిచితురాలైన వజ్మా.. ఈ వరల్డ్‌ కప్‌తోనే ప్రపంచవ్యాప్తంగా పాపులరైందని చెప్పచ్చు. ఇందుకు భారత క్రికెట్‌ జట్టుపై ఆమె చూపిస్తోన్న అభిమానమే కారణం! ముఖ్యంగా టీమిండియాలో విరాట్‌ కోహ్లీకి వీరాభిమాని అయిన ఈ ఫ్యాన్‌ గర్ల్‌.. ఇటీవలే కోహ్లీ పుట్టిన రోజు సందర్భంగా సోషల్‌ మీడియా వేదికగా ప్రత్యేకంగా విషెస్‌ తెలిపింది. ‘విరాట్‌ ప్రపంచ క్రికెట్‌కు అసలైన అంబాసిడర్‌. అతడిలో అద్వితీయమైన ప్రతిభ దాగుంది. నా ఫేవరెట్‌ క్రికెటర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు!’ అంటూ పోస్ట్‌ పెట్టింది వజ్మా. ఇప్పుడే కాదు.. ఇటీవలే ‘ఆసియా కప్‌’ జరిగిన సమయంలోనూ.. కోహ్లీ సంతకం చేసి తనకు బహూకరించిన విరాట్‌ బ్లూ జెర్సీని ధరించిన ఫొటోను ట్విట్టర్‌లో పంచుకుందీ అఫ్గాన్‌ బ్యూటీ. టీమిండియాకు, కోహ్లీకి బెస్ట్‌ విషెస్‌ తెలియజేస్తూ.. మరోసారి భారత్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకుంది.

బౌలింగ్‌తో మాయ చేశాడు!

అయితే ప్రస్తుతం అఫ్గానిస్థాన్‌ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించినా.. భారత్‌కు తన మద్దతు తెలుపుతోంది వజ్మా. ఈ క్రమంలోనే సెమీఫైనల్‌ మ్యాచ్‌లో మన జట్టు విజయం సాధించాక.. ఏకంగా తన స్వదేశీ జట్టే గెలిచినంతగా సంబరపడిపోయింది. ఇక షమీ బౌలింగ్‌ను ప్రత్యేకంగా ప్రశంసించిందీ క్రికెట్‌ ఫ్యాన్‌. షమీ ఫొటోను ట్విట్టర్‌లో పంచుకుంటూ.. ‘ఓ మై గాడ్‌! ఏడు వికెట్లు.. వాట్‌ ఎ క్రికెటర్‌.. వాట్‌ ఎ పర్ఫార్మెన్స్‌.. కంగ్రాట్స్‌ టీమిండియా!’ అంటూ క్యాప్షన్‌ పెట్టింది. ఇలా షమీ బౌలింగ్‌ ప్రదర్శనకు చాలామంది అమ్మాయిల్లాగే తానూ ఫిదా అయ్యానంటూ చెప్పకనే చెప్పిందీ ముద్దుగుమ్మ.


ఎకో-లవర్‌.. ఫ్యాషనర్‌!

ఇలా టీమిండియాపై తనకున్న అభిమానంతో పోస్టులు పెడుతూ సోషల్‌ స్టార్‌గా మారిపోయిన వజ్మా.. తన అందంతోనూ ఎంతోమంది అభిమానుల్ని, ఫాలోయర్లను సంపాదించుకుంది. ప్రస్తుతం ఇన్‌స్టాలో ఆమెకు 8.5 లక్షల మందికి పైగా ఫాలోవర్లున్నారు. కేవలం మన క్రికెట్‌ జట్టుపైనే కాదు.. భారతీయ కట్టూ-బొట్టూ, ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలపైనా మక్కువ చూపుతుంటుంది వజ్మా. ఈ క్రమంలోనే చీరకట్టు, నుదుటన బొట్టుతో దిగిన ఫొటోల్నీ సోషల్‌ మీడియాలో పంచుకుంటుంటుంది. అంతేకాదు.. బాలీవుడ్‌ ఇండస్ట్రీకీ ఫ్యాన్‌ అయిన వజ్మా.. పలువురు బాలీవుడ్‌ తారలు/ప్రముఖులతో దిగిన ఫొటోల్నీ ఇన్‌స్టాలో పంచుకుంటూ తన అభిమానాన్ని మరోసారి చాటుకుంది. వజ్మా పర్యావరణ ప్రేమికురాలు కూడా! ఈ క్రమంలోనే తన పనులతో ప్రకృతిపై తనకున్న ప్రేమను చాటుకోవడంతో పాటు.. పర్యావరణహిత దుస్తుల్ని/ఫ్యాషన్‌ని ప్రోత్సహిస్తోందామె. ఇక వజ్మా కెరీర్‌ విషయానికొస్తే.. ప్రస్తుతం తాను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో కొనసాగుతున్నట్లు సోషల్‌ మీడియా బయో ద్వారా తెలుస్తోంది. సోషల్‌ యాక్టివిస్ట్‌గానూ ఈ చక్కనమ్మకు పేరుంది. ఈ క్రమంలో తన స్వదేశంలో బాలికా విద్యను ప్రోత్సహించాలంటూ పలు ఉద్యమాలూ నిర్వహిస్తుంటుంది వజ్మా.
Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్