Published : 28/01/2023 00:14 IST

ముందు.. అప్పు తీర్చమన్నారు!

ఎంత అందమైన లోకం! దాన్ని తిరిగి చూడకపోతే ఎలా? అందుకే ఎలాగైనా ప్రపంచాన్ని చుట్టేయాలని ఎప్పుడో నిర్ణయించుకున్నా. నా భర్తదీ అదే ఆలోచన. ఇద్దరం కలిసి ఎన్ని ప్రదేశాలను చూసొచ్చామో! అప్పుడే కొన్ని ప్రత్యేక ప్రాంతాలు, అడ్వెంచర్ల గురించిన సమాచారం అక్కడికి వెళితేగానీ తెలియట్లేదన్న విషయం అర్థమైంది. ఈ వివరాలన్నింటితో ఓ స్టార్టప్‌ ప్రారంభిస్తే బాగుంటుందని అనిపించింది. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో డిగ్రీ చేసి.. మంచి ఉద్యోగంలో స్థిరపడ్డా. అయినా రాజీనామా చేసి, లోను పెట్టి ఎంబీఏ చేశా. పూర్తయ్యాక నా ఆలోచన విని ఇంట్లోవాళ్లు, స్నేహితులు పిచ్చిదానిలా చూశారు. ‘ముందు చదువుకైన లోను తీర్చు. తర్వాత పెట్టుబడి గురించి ఆలోచించొచ్చు’ అన్నవారూ లేకపోలేదు. నిజమే.. పెట్టుబడి లేదు.. బలమైన ఆలోచన ఉందిగా! దాన్ని మించి నా మీద నాకు 200% నమ్మకం ఉంది. అందుకే ఏడాదిపాటు ఎక్కువమంది ఇష్టపడుతున్న ప్రాంతాలు, అడ్వెంచర్లు, నిర్వాహకుల వివరాలను సేకరించి ఆన్‌లైన్‌లో ‘థ్రిల్లోఫిలియా’ ప్రారంభించా. పర్యటనలు, అడ్వెంచర్లు అన్నింటినీ మా వెబ్‌సైట్‌ ద్వారా ప్లాన్‌ చేసుకోవచ్చు. భిన్న దేశాల్లో నెట్‌వర్క్‌నీ ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు మా సంస్థ విలువ రూ.150 కోట్లకు పైమాటే! మా సేవల్ని వినియోగించుకున్నవారూ వేలల్లో ఉన్నారు. ఎన్నో పురస్కారాలూ అందుకున్నా. అందరూ అన్న ఆ ‘రిస్క్‌’ తీసుకోవడానికి నేను సిద్ధపడ్డా. మీకూ మీ ఆలోచనపై నమ్మకం ఉందా.. ప్రయత్నించేయండి. దానికోసం రిస్క్‌ తీసుకునే ధైర్యం చేయండి.. అప్పుడే విజయం సాధ్యం!

- చిత్రా గుర్నాని దాగా, సీఈఓ, థ్రిల్లోఫిలియా


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి