థంబ్ నైఫ్.. కాయగూరలు కోయడం ఎంతో ఈజీ!

ఎంతో ముచ్చటపడి ఇంట్లోనే ఓ మినీ గార్డెన్‌ ఏర్పాటుచేసుకుంటాం. నచ్చిన కాయగూరల్ని, ఆకుకూరల్ని సహజసిద్ధంగా పండించుకుంటాం. అయితే కాస్త మందంగా, తీగలాగా ఉన్న కాయగూరల కాండాల్ని చేత్తో కత్తిరించలేం. అవి ఓ పట్టాన కట్‌ అవ్వకపోగా.. వేళ్లకు గాయాలయ్యే ప్రమాదమూ లేకపోలేదు.

Published : 08 Apr 2024 12:21 IST

ఎంతో ముచ్చటపడి ఇంట్లోనే ఓ మినీ గార్డెన్‌ ఏర్పాటుచేసుకుంటాం. నచ్చిన కాయగూరల్ని, ఆకుకూరల్ని సహజసిద్ధంగా పండించుకుంటాం. అయితే కాస్త మందంగా, తీగలాగా ఉన్న కాయగూరల కాండాల్ని చేత్తో కత్తిరించలేం. అవి ఓ పట్టాన కట్‌ అవ్వకపోగా.. వేళ్లకు గాయాలయ్యే ప్రమాదమూ లేకపోలేదు. అలా జరగకుండా ఉండాలంటే ‘థంబ్‌ నైఫ్‌’ ఉపయోగించాల్సిందే!

ఈ థంబ్‌ నైఫ్‌ సెట్‌లో భాగంగా వేళ్లకు తొడుక్కునే రెండు చిన్న సిలికాన్‌ గ్లౌజులుంటాయి. బొటన వేలికి తొడిగే గ్లౌజుకు చివర పదునైన కర్వీ ఆకారంలో ఉండే చిన్న కత్తి అనుసంధానమై ఉంటుంది. చూపుడు వేలికి తొడిగేలా పొడవైన, మందపాటి గ్లౌజ్‌ ఉంటుంది. వీటి సహాయంతో ఎంత గట్టిగా, మందంగా ఉన్న కాండాలనైనా/తీగలైనా సునాయాసంగా కత్తిరించచ్చు. ఇలా ఈ రెండు వేళ్లకే కాదు.. ఐదు వేళ్లు, అరచేయి పూర్తిగా కవరయ్యేలా రూపొందించిన థంబ్‌ నైఫ్‌ గ్లౌజులు కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి. వీటిని సిలికాన్‌తో తయారుచేస్తారు కాబట్టి ఫ్లెక్సిబుల్‌గా ఉంటూనే ఎక్కువ రక్షణను అందిస్తాయి.

కొన్ని రకాల పండ్ల తొక్కలు, కాయధాన్యాల తొక్కలు ఒలిచేటప్పుడు; దృఢమైన పెంకుల్ని పగలగొట్టి వాటిలోని గింజల్ని బయటికి తీసే క్రమంలో వేలి గోళ్లకు గాయాలయ్యే ప్రమాదం ఎక్కువ. ఈ సమస్య లేకుండా ‘ఫింగర్‌ గార్డ్‌’ రక్షణనిస్తుంది. బొటనవేలికి తొడుక్కునేలా, చివరికి కాస్త షార్ప్‌గా ఉండే ఈ టూల్‌ సహాయంతో ఆయా పనుల్ని సులభంగా చేసేసుకోవచ్చు. అలాగే కాయగూరల్ని తరిగేటప్పుడూ బొటనవేలికి రక్షణగా దీన్ని అమర్చుకోవచ్చు.

Photos: Amazon.in

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్