చెత్తబుట్ట నుంచి దుర్వాసన రాకుండా..!

కిచెన్‌లో వంట చేసే క్రమంలో కాయగూరల వ్యర్థాలు, పాత్రలు శుభ్రం చేసేటప్పుడు మిగిలిపోయిన పదార్థాలు చెత్తబుట్టలో పడేయడం మనకు అలవాటే! అయితే ఇలా రోజంతా పోగైన వ్యర్థాలతో అందులో నుంచి దుర్వాసన వెలువడుతుంది.. ఈ వాసన వంటగదిలోనూ విస్తరిస్తుంది. అలాగే ఒక్కోసారి చెత్తడబ్బాను శుభ్రం చేసినా ఆ వాసన పోదు.

Published : 24 Apr 2024 12:40 IST

కిచెన్‌లో వంట చేసే క్రమంలో కాయగూరల వ్యర్థాలు, పాత్రలు శుభ్రం చేసేటప్పుడు మిగిలిపోయిన పదార్థాలు చెత్తబుట్టలో పడేయడం మనకు అలవాటే! అయితే ఇలా రోజంతా పోగైన వ్యర్థాలతో అందులో నుంచి దుర్వాసన వెలువడుతుంది.. ఈ వాసన వంటగదిలోనూ విస్తరిస్తుంది. అలాగే ఒక్కోసారి చెత్తడబ్బాను శుభ్రం చేసినా ఆ వాసన పోదు. ఇలాంటప్పుడు కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే కిచెన్‌లో చెత్తబుట్టను పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు.

⚛ చెత్త తొలగించిన ప్రతిసారీ చెత్తబుట్టను కడగడం చాలామందికి అలవాటు! అయితే ఆపై డబ్బా అడుగున పేపర్‌ లేదా కవర్‌ వేస్తుంటాం. ఇవి వేసే ముందు కాస్త బేకింగ్‌ సోడా చల్లితే అందులో నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది.

⚛ కొంతమంది తడి చెత్త, పొడి చెత్త ఒకే చెత్తడబ్బాలో వేస్తుంటారు. ఈ రెండూ కలిసి ఒక రకమైన దుర్వాసన వెలువడుతుంది. కాబట్టి తడి చెత్త, పొడి చెత్త వేర్వేరు డబ్బాల్లో వేయడం మంచిది. అలాగే తడి చెత్త వేసేటప్పుడు చెత్త డబ్బా అడుగున మందపాటి పేపర్‌ వేయడం వల్ల తేమను ఆ పేపర్‌ పీల్చుకుంటుంది. లేదంటే తేమతో కూడిన వ్యర్థాల్ని ఒక పేపర్‌లో మడిచి డస్ట్‌బిన్‌లో పడేసినా ఫలితం ఉంటుంది.

⚛ తడి చెత్త కోసం కిచెన్‌ లోపల కాకుండా బయట ఒక డస్ట్‌బిన్‌ ఏర్పాటుచేసుకోవడం మంచిది. ఇందులో తడిచెత్త, మాంసం తెచ్చిన కవర్లు.. వంటివి పడేస్తే వంటగదిలో దుర్వాసన రాకుండా జాగ్రత్తపడచ్చు.

⚛ కాఫీ గింజలకు దుర్వాసనను పీల్చుకునే గుణం ఉంది. కాబట్టి చెత్తబుట్ట అమర్చుకునే క్యాబినెట్‌ మూలలో కాఫీ గింజలతో నింపిన బౌల్‌ని ఉంచితే ఫలితం ఉంటుంది.

⚛ చెత్తను తొలగించిన ప్రతిసారీ డబ్బాను యాంటీబ్యాక్టీరియల్‌ స్ప్రే, బ్లీచ్‌, వెనిగర్‌, డిస్‌-ఇన్ఫెక్టెంట్‌ ద్రావణాలతో శుభ్రం చేయాలి. ఆపై కాసేపు చెత్తడబ్బాను ఎండలో ఆరబెడితే ఇందులో ఏవైనా క్రిములుంటే నశిస్తాయి.

⚛ పిల్లులు, కుక్కల్ని పెంచుకునే వారి ఇళ్లలో క్యాట్‌ లిట్టర్స్‌ (పెట్‌ బెడ్డింగ్‌ మెటీరియల్‌) ఉంటాయి. ఈ మట్టిని కొద్దిగా తీసుకొని చెత్తడబ్బా అడుగున వేసినా దుర్వాసన వెలువడకుండా జాగ్రత్తపడచ్చట.

⚛ నిమ్మకాయల్ని స్లైసుల్లా కట్‌ చేసి చెత్తడబ్బా అడుగున వేయాలి. నిమ్మ సహజసిద్ధమైన క్లీనింగ్‌ ఏజెంట్‌గా పనిచేస్తుంది. దీనివల్ల కూడా అందులో నుంచి దుర్వాసన వెలువడకుండా ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్