అది నేను కాదు.. కదా!

సామాజిక మాధ్యమాల్లో ఫొటో షేర్‌ చేసేముందు ఎడిట్‌ చేసేదాన్ని. యాప్‌లో శరీరం సన్నగా, ముఖం అందంగా కనిపించేలా మార్చేదాన్ని. చూసినవాళ్లెవరైనా ఎడిట్‌ చేసిందంటే నమ్మలేరు. అంత పక్కాగా ఫొటో సిద్ధమయ్యేది. ఓరోజు ఇలాగే చేస్తున్నా. అప్పుడు అకస్మాత్తుగా ‘ఫొటో అందంగా ఉంది సరే... అది నేను కాదు కదా!’ అనిపించి బాధేసింది.

Published : 25 Feb 2023 00:28 IST

సామాజిక మాధ్యమాల్లో ఫొటో షేర్‌ చేసేముందు ఎడిట్‌ చేసేదాన్ని. యాప్‌లో శరీరం సన్నగా, ముఖం అందంగా కనిపించేలా మార్చేదాన్ని. చూసినవాళ్లెవరైనా ఎడిట్‌ చేసిందంటే నమ్మలేరు. అంత పక్కాగా ఫొటో సిద్ధమయ్యేది. ఓరోజు ఇలాగే చేస్తున్నా. అప్పుడు అకస్మాత్తుగా ‘ఫొటో అందంగా ఉంది సరే... అది నేను కాదు కదా!’ అనిపించి బాధేసింది. దుఃఖమూ తన్నుకొచ్చింది. నా అసలు ఫొటో షేర్‌ చేస్తే ఎలాంటి కామెంట్లు వస్తాయోనన్న భయమో, అందంగా కనిపించడం లేదన్న భావనో.. ఏదైతేనేం ముందు నన్ను నేను అంగీకరించట్లేదనేగా అర్థం. అలా అనిపించాక వెంటనే యాప్‌లన్నీ తొలగించేశా. సినిమా విషయంలోనూ ‘నువ్వు మంచి నటివే.. కానీ కొద్దిగా లావయ్యావ్‌’ అన్న కామెంట్లు వస్తుంటాయి. నిజమే ఈ రంగంలోకి అడుగుపెట్టి దశాబ్దంపైనే! 20ల్లోలా ఇప్పటికీ ఉండటం అసాధ్యం. అలాగే ప్రతి రోజూ, ప్రతి క్షణం ఫొటో రెడీగా ఉండటమూ ఎవరి వల్లా కాదు. ఈ విషయాన్ని ముందు అర్థం చేసుకొని నన్ను నేను స్వీకరించుకోవడం మొదలుపెట్టా. కాబట్టి, సామాజిక మాధ్యమాల్లో కనిపించేదంతా వాస్తవం అనుకోవద్దు. ఎవరి రూపురేఖలో, శరీర ఛాయో చూసి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. ఎలా ఉన్నారో దానికి ఆనందంగా ఉండటం నేర్చుకోండి. అసంతృప్తులకు తావుండదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్