విన్యాసాల వీర వనితలు..

90 మంది బైకర్ణీలు దేశ రాజధాని నుంచి బయల్దేరారు. వివిధ పట్టణాల్లో పర్యటిస్తూ విన్యాసాలు చేస్తున్నారు. సరదాకి కాదు.. ఓ సందేశాన్నీ మోసుకొస్తున్నారు. మహిళా సాధికారతకు, స్త్రీ శక్తికీ చిహ్నంగా ఈ పర్యటనను ప్రారంభించారు. ఇంతకీ వీళ్లెవరంటారా? డేర్‌డెవిల్స్‌ మహిళా బైకర్ల బృందం. సైనికులతో పోటీగా బైకులపై గణతంత్ర వేడుకలు సహా వివిధ సందర్భాల్లో తమ సత్తా చాటింది వీళ్లే!

Published : 18 Mar 2023 00:06 IST

90 మంది బైకర్ణీలు దేశ రాజధాని నుంచి బయల్దేరారు. వివిధ పట్టణాల్లో పర్యటిస్తూ విన్యాసాలు చేస్తున్నారు. సరదాకి కాదు.. ఓ సందేశాన్నీ మోసుకొస్తున్నారు. మహిళా సాధికారతకు, స్త్రీ శక్తికీ చిహ్నంగా ఈ పర్యటనను ప్రారంభించారు. ఇంతకీ వీళ్లెవరంటారా? డేర్‌డెవిల్స్‌ మహిళా బైకర్ల బృందం. సైనికులతో పోటీగా బైకులపై గణతంత్ర వేడుకలు సహా వివిధ సందర్భాల్లో తమ సత్తా చాటింది వీళ్లే! తాజా సీఆర్‌పీఎఫ్‌ ఆధ్వర్యంలో ‘దేశ్‌ కే హమ్‌ హై రక్షక్‌ అభియాన్‌’ పేరుతో మహిళా సాధికారతపై అవగాహనను కల్పిస్తున్నారు. మార్చి 9న 75 బైకులపై వీళ్లు ఇండియా గేట్‌ నుంచి ప్రారంభమయ్యారు.

25తో పర్యటన చత్తీస్‌గఢ్‌లో ముగుస్తుంది. తాజాగా ఈ బృందం భోపాల్‌లో పర్యటిస్తోంది. అక్కడ విన్యాసాలు చేసి అందరినీ అబ్బుర పరిచినప్పటిదీ చిత్రం. ‘రోజుకు 300-350 కిమీలు ప్రయాణిస్తున్నాం. మాకు మద్దతుగా ఎంతోమంది మహిళలు ర్యాలీలో పాల్గొంటున్నారు. వాళ్ల ప్రేమ, అభిమానాలు, గౌరవం మర్చిపోలేం. ఈ ర్యాలీతో ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలవడం ఆనందంగా ఉంది’ అన్నారు ర్యాలీకి నాయకత్వం వహిస్తోన్న డెప్యూటీ కమాండెంట్‌ తారాదేవి. 37 ఏళ్ల అనుభవం ఈవిడది. శ్రీనగర్‌ నుంచి శ్రీలంక వరకు ఎన్నో ప్రాంతాల్లో పనిచేసిందావిడ. ఈ బృందం ప్రయాణించిన ప్రాంతాల్లో సీఆర్‌పీఎఫ్‌ బృందం, అధికారులు ఎదురేగి స్వాగతం పలుకుతున్నారు. వారి విన్యాసాలు, ఆ ధైర్యానికి సలాం కొడుతున్నారు. మనమూ సెల్యూట్‌ కొడదామా మరి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్