Trains collide: చైనాలో రెండు మెట్రో రైళ్లు ఢీ.. 515 మందికి గాయాలు!

చైనా రాజధాని బీజింగ్‌లో రెండు మెట్రో రైళ్లు ఢీ కొన్న ఘటనలో 515 మందికి గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు.

Published : 15 Dec 2023 20:54 IST

బీజింగ్‌: చైనా రాజధాని బీజింగ్‌లో (Beijing) రెండు మెట్రో రైళ్లు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో 515 మందికి గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 102 మందికి తీవ్ర గాయాలయ్యాయని.. ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. ఇప్పటికే నాలుగు వందల మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయినట్లు ప్రకటించారు. భారీగా మంచు కురుస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందన్నారు. మంచు కారణంగా జారుతున్న ట్రాకులపై సరిగ్గా బ్రేకులు పడకపోవడంతోనే రైలు ఢీ కొన్నాయని అన్నారు. గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు బీజింగ్‌ రవాణా అధికారులు వెల్లడించారు.

ప్రపంచంలో అత్యంత బిజీ మెట్రో రైల్‌ వ్యవస్థలో బీజింగ్‌ ఒకటి. ఇక్కడ 27 మార్గాల్లో నిత్యం 1.30కోట్ల మంది ప్రయాణిస్తుంటారు. రద్దీ సమయంలో నిమిషానికొక రైలు సర్వీసు అందుబాటులో ఉంటుంది. అయితే, కొన్ని రోజులుగా అక్కడ విపరీతంగా మంచు కురుస్తోంది. దీంతో స్కూళ్లతోపాటు బహిరంగ వినోద కేంద్రాలను అధికారులు మూసివేశారు. ఈ క్రమంలో పౌరులు ప్రజా రవాణాకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. మూడు రోజులుగా అక్కడి మెట్రో రైళ్లలో విపరీతమైన రద్దీ పెరిగినట్లు అధికారులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని