China: ఆస్ట్రేలియాకు షాకిచ్చిన చైనా..!

ఆస్ట్రేలియాకు షాకిస్తూ.. చైనా-సాల్మన్‌ ఐలాండ్స్‌ ఓ రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. చైనా విదేశాఖ ప్రతినిధి వాంగ్‌వెన్‌బిన్‌ ఈ విషయంపై ప్రకటన విడుదల చేశారు. ‘‘చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్‌ యీ, సాల్మన్‌ ఐలాండ్స్‌ విదేశాంగ శాఖ మంత్రి జర్మేహ్‌ మనెలె  రక్షణ సహకార ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు ప్రజా భద్రత, సామాజిక సురక్షిత, ప్రజల ఆస్తులను కాపాడటం

Published : 20 Apr 2022 15:17 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియాకు షాకిస్తూ.. చైనా-సాల్మన్‌ ఐలాండ్స్‌ ఓ రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్‌వెన్‌బిన్‌ ఈ విషయంపై ప్రకటన విడుదల చేశారు. ‘‘చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్‌ యీ, సాల్మన్‌ ఐలాండ్స్‌ విదేశాంగ శాఖ మంత్రి జర్మేహ్‌ మనెలె.. రక్షణ సహకార ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు ప్రజా భద్రత, సురక్షిత సమాజం కోసం, ప్రజల ఆస్తులను కాపాడటంలో, ప్రకృతి విపత్తుల సమయంలో మానవీయ సాయం చేసుకొనేలా సహకరించుకొంటాయి. అంతేకాదు.. సాల్మన్‌ ఐలాండ్స్‌ తనను తాను రక్షించుకొనేలా సామర్థ్యాలను పెంచేందుకు చైనా సహకరిస్తుంది’’ అని పేర్కొన్నారు. 

చైనాతో ఒప్పందంపై ఇప్పటికే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, అమెరికాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దీనిపై సాల్మన్‌ ఐలాండ్స్‌ స్పందిస్తూ.. తాజాగా జరిగిన ఒప్పందంలో చైనా సైనిక స్థావరాన్ని సాల్మన్‌ ద్వీపాల్లో నెలకొల్పే అంశం ఏమీ లేదని వెల్లడించింది. కొత్త ఒప్పందానికి సంబంధించిన ఎటువంటి వివరాలు  మాత్రం వెల్లడించలేదు. సాల్మన్‌ ద్వీపాలకు చైనా ఎటువంటి సహకారం అందిస్తుందనే అంశంపై కూడా స్పష్టత లేదు. ఈ ఒప్పందంపై ఆస్ట్రేలియా విదేశాంగ శాఖ మంత్రి మారిస్‌ పైన్‌ మాట్లాడుతూ ‘‘ ఆస్ట్రేలియా తీవ్ర నిరాశ చెందింది. ఒప్పందంలో పారదర్శకత లోపించడం ఆందోళన కలిగిస్తోంది’’ అని పేర్కొంది. ఈ వారం  అమెరికాకు చెందిన సీనియర్‌ దౌత్యవేత్తల బృందం కూడా సాల్మన్‌లో పర్యటించనుంది. అక్కడ అమెరికా రాయబార కార్యాలయాన్ని తిరిగి తెరిచే అంశంపై చర్చలు జరపనున్నారు.  ఈ రాయబార కార్యాలయాన్ని 29 ఏళ్ల క్రితం మూసివేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని