కాలిఫోర్నియాలో ఛత్రపతి శివాజీ విగ్రహం చోరీ

అమెరికాలోని కాలిఫోర్నియా సాన్‌ జోస్‌ సిటీ పార్క్‌లో ఉన్న ఛత్రపతి శివాజీ విగ్రహం చోరీకి గురయింది.

Published : 08 Feb 2023 04:50 IST

న్యూయార్క్‌: అమెరికాలోని కాలిఫోర్నియా సాన్‌ జోస్‌ సిటీ పార్క్‌లో ఉన్న ఛత్రపతి శివాజీ విగ్రహం చోరీకి గురయింది. ఉత్తర అమెరికా ఖండంలో ఛత్రపతి ఏకైక విగ్రహం ఇది.
‘‘విగ్రహం దొంగిలించడం బాధాకరం. దీనికి మేము చింతిస్తున్నాం. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాం’’ అని పార్క్‌ అధికారులు శుక్రవారం ట్వీట్‌ చేశారు. సాన్‌ జోస్‌ సిస్టర్‌ సిటీగా పిలిచే పుణె నగరం.. ఈ మరాఠా యోధుడి విగ్రహన్ని సిటీ పార్క్‌కు బహూకరించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు