తక్షణం బందీలను విడుదల చేయండి

రఫాపై ఇజ్రాయెల్‌ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్‌కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి.

Published : 26 Apr 2024 05:22 IST

హమాస్‌కు బైడెన్‌ సహా 18 దేశాల నేతల విజ్ఞప్తి

వాషింగ్టన్‌: రఫాపై ఇజ్రాయెల్‌ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్‌కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. ‘‘200 రోజులుగా బందీలుగా ఉంచుకున్న అందరినీ తక్షణం హమాస్‌ విడుదల చేయాలి. అందులో మా దేశ పౌరులూ ఉన్నారు. బందీలకు, గాజాలోని పౌరులకు అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా రక్షణ ఉంటుంది. బందీలను విడుదల చేస్తే తక్షణం కాల్పుల విరమణ అమల్లోకి వస్తుంది. గాజా ప్రాంతానికి అవసరమైన మానవతా సాయం పంపేందుకు వీలవుతుంది. బందీలను ఇంటికి తీసుకొచ్చేందుకు జరుగుతున్న చర్చలకు మేం పూర్తిస్థాయిలో మద్దతిస్తున్నాం’’ అని 18 దేశాలు ఒక ప్రకటనలో తెలిపాయి. దీనిపై అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో పాటు.. అర్జెంటీనా, ఆస్ట్రియా, బ్రెజిల్‌, బల్గేరియా, కెనడా, కొలంబియా, డెన్మార్క్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, హంగరి, పోలండ్‌, పోర్చుగల్‌, రొమేనియా, సెర్బియా, స్పెయిన్‌, థాయ్‌లాండ్‌, బ్రిటన్‌ దేశాలు కూడా సంతకాలు చేశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని