France Elections: మెక్రాన్‌దే ఫ్రాన్స్‌ పీఠం

ఫ్రాన్స్‌ అధ్యక్ష పీఠం మరోసారి ప్రస్తుత అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌నే వరించింది! వాస్తవానికి ఆదివారం నిర్వహించిన రెండో విడత ఎన్నికల ఫలితాలు కడపటి వార్తలందే సమయానికి అధికారికంగా వెలువడకున్నా..

Updated : 25 Apr 2022 06:09 IST

ఓటమిని అంగీకరించిన మరీన్‌ లీ

పారిస్‌: ఫ్రాన్స్‌ అధ్యక్ష పీఠం మరోసారి ప్రస్తుత అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌నే వరించింది! వాస్తవానికి ఆదివారం నిర్వహించిన రెండో విడత ఎన్నికల ఫలితాలు కడపటి వార్తలందే సమయానికి అధికారికంగా వెలువడకున్నా.. ఆయన ప్రత్యర్థి మరీన్‌ లీ పెన్‌ ఓటమిని అంగీకరించారు. దీంతో ఫలితం ముందుగానే తేలిపోయినట్లయింది. 2017 నాటి అధ్యక్ష ఎన్నికల్లోనూ వీరిద్దరే ప్రత్యర్థులుగా ఉన్నారు. లీ పెన్‌ ఆలోచనలు, సిద్ధాంతాలు అతివాదాన్ని తలపిస్తున్నాయని, అవి ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉన్నాయని అనేక మంది ముందస్తు సర్వేల్లో అభిప్రాయపడ్డారు. ముస్లిం మహిళలు బహిరంగ ప్రదేశంలో హిజాబ్‌ ధరించడాన్ని నిషేధిస్తానని ఆమె ప్రకటించడాన్ని ప్రస్తావించారు. అలాగే రష్యాతో ఆమెకున్న సంబంధాలూ చర్చనీయాంశమయ్యాయి. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయానికల్లా తుది ఫలితం రావొచ్చు. ఒపీనియన్‌ పోల్స్‌ అంచనాల ప్రకారం రెండో విడత ఎన్నికల్లో మెక్రాన్‌కు 57%-58.5% ఓట్లు, మరీన్‌కు 41.5%-43% ఓట్లు రానున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని