ఎల్బ్రస్‌ శిఖరాగ్రంపై త్రివర్ణ పతాకం

పంద్రాగస్టు సందర్భంగా మధ్యప్రదేశ్‌కు చెందిన పర్వతారోహకురాలు భావనా దేహరియా(30)... ఐరోపాలో అత్యంత ఎత్తయిన మౌంట్‌ ఎల్బ్రస్‌ను అధిరోహించారు. సోమవారం తెల్లవారుజామున అక్కడ త్రివర్ణ

Published : 16 Aug 2022 05:48 IST

లండన్‌: పంద్రాగస్టు సందర్భంగా మధ్యప్రదేశ్‌కు చెందిన పర్వతారోహకురాలు భావనా దేహరియా(30)... ఐరోపాలో అత్యంత ఎత్తయిన మౌంట్‌ ఎల్బ్రస్‌ను అధిరోహించారు. సోమవారం తెల్లవారుజామున అక్కడ త్రివర్ణ పతాకం ఎగురవేశారు. రష్యా-జార్జియా సరిహద్దుల్లో, సముద్ర మట్టానికి 5,642 మీటర్ల ఎత్తున ఎల్బ్రస్‌ శిఖరాగ్రం ఉంది. మైనస్‌ 25 డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువ ఉష్ణోగ్రత, ఈదురు గాలులకు తోడు దృశ్య సామీప్యత తక్కువగా ఉన్న పరిస్థితుల్లో తన బృందంతో కలిసి ఈ సాహస యాత్రను పూర్తిచేసినట్టు భావన వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని