France: ఫ్రాన్స్‌లో 25ఏళ్లలోపు వారికి ఉచితంగా కండోమ్‌లు: అధ్యక్షుడు మేక్రాన్‌ ప్రకటన

ఫ్రాన్స్‌లో 25 ఏళ్లలోపు వయసున్న ఎవరైనా జనవరి ఒకటో తేదీ నుంచి ఔషధ దుకాణాల్లో ఉచితంగా కండోమ్‌లు పొందొచ్చని ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ శుక్రవారం ప్రకటించారు.

Updated : 11 Dec 2022 08:51 IST

ప్యారిస్‌: ఫ్రాన్స్‌లో 25 ఏళ్లలోపు వయసున్న ఎవరైనా జనవరి ఒకటో తేదీ నుంచి ఔషధ దుకాణాల్లో ఉచితంగా కండోమ్‌లు పొందొచ్చని ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ శుక్రవారం ప్రకటించారు. యువతలో పెరిగిపోతున్న లైంగిక అంటురోగాలకు అడ్డుకట్ట వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. ఫ్రాన్స్‌లో ఇప్పటికే 25 ఏళ్లలోపు బాలికలు, యువతులు ఉచితంగా కండోమ్‌లు పొందుతున్నారు.

అవాంఛిత గర్భధారణలను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఈ సదుపాయం కల్పించింది. వాస్తవానికి గురువారం మేక్రాన్‌ మాట్లాడుతూ.. జనవరి ఒకటో తేదీ నుంచి 18-25 ఏళ్లలోపు వారు ఔషధ దుకాణాల్లో ఉచితంగా కండోమ్‌లు పొందొచ్చని ప్రకటించారు. అనంతరం ఫ్రెంచ్‌ టీవీ ప్రెజెంటర్‌ ఒకరు, మరికొందరు వ్యక్తులు సామాజిక మీడియాలో అధ్యక్షుడి నిర్ణయాన్ని ప్రశ్నించారు. మైనర్లను ఎందుకు చేర్చలేదని నిలదీశారు. దీంతో ఈ కార్యక్రమాన్ని వారికీ విస్తరిస్తున్నట్లు అధ్యక్షుడు ప్రకటించారు. ఈ మేరకు ప్రస్తుతం స్పెయిన్‌లో ఉన్న ఆయన ఓ సెల్ఫీ వీడియోను పోస్ట్‌ చేశారు. ‘అలాగే చేద్దాం’ అని అందులో పేర్కొన్నారు. ‘‘చాలా మంది మైనర్లు కూడా శృంగారంలో పాల్గొంటున్నారు. తమనుతాము రక్షించుకోవడం వారికీ అవసరం’’ అని ట్విటర్‌లో వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని