Joe Biden: సైకిల్ పైనుంచి కిందపడిన బైడెన్‌

అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్‌ (79) సైకిల్‌ నడుపుకుంటూ వచ్చి కిందపడ్డారు. అదృష్టవశాత్తూ ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు.......

Updated : 18 Jun 2022 23:57 IST

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్‌ (79) సైకిల్‌ తొక్కుతూ కిందపడ్డారు. అదృష్టవశాత్తూ ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. డెలావేర్‌లోని అధ్యక్షుడి బీచ్ హోంకు సమీపంలో ఉన్న స్టేట్ పార్క్‌లో ప్రథమ మహిళ జిల్ బిడెన్‌తో పాటు మరికొందితో కలిసి బైడెన్‌ సైకిల్‌పై వెళ్లారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకొన్న కొందరితో మాట్లాడేందుకు బైడెన్‌ తన సైకిల్‌ను ఆపారు. బ్యాలెన్స్‌ కోల్పోయి అధ్యక్షుడు కిందపడ్డారు. అక్కడే ఉన్న కొందరు ఆయన్ను వెంటనే పైకిలేపారు. కాగా ఈ ఘటనలో బైడెన్‌కు ఎలాంటి గాయం కాలేదు. ‘ఐయామ్‌ గుడ్‌’ అని అధ్యక్షుడు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఘటనను వైట్‌హౌస్‌ సైతం ధ్రువీకరించింది. అధ్యక్షుడికి ఎలాంటి ప్రమాదం జరగలేదని పేర్కొంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని