ట్రంప్‌తో ఏకాంతంగా గడిపా: శృంగారతార స్టార్మీ డేనియల్స్‌

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ఏకాంతంగా గడిపానని శృంగార తార స్టార్మీ డేనియల్స్‌ పేర్కొన్నారు. ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడకుండా ఉండేందుకు తనకు డబ్బులు కూడా ముట్టజెప్పారన్నారు.

Updated : 09 May 2024 08:48 IST

న్యూయార్క్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ఏకాంతంగా గడిపానని శృంగార తార స్టార్మీ డేనియల్స్‌ పేర్కొన్నారు. ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడకుండా ఉండేందుకు తనకు డబ్బులు కూడా ముట్టజెప్పారన్నారు. అధ్యక్ష ఎన్నికల సమయంలో తనకు వ్యతిరేకంగా మాట్లాడకుండా అడ్డుకోవడానికి ట్రంప్‌ అడ్డదారులు తొక్కారనే ఆరోపణలపై విచారణ జరుగుతున్న క్రమంలో న్యూయార్క్‌ కోర్టులో ఆమె వాంగ్మూలం ఇచ్చారు. ఈ సందర్భంగా ట్రంప్‌ను తానెలా కలిసిందీ.. ఇద్దరి మధ్య శృంగారం ఎలా జరిగిందీ తదితర వివరాలను కోర్టులోని జ్యూరీ సభ్యులకు తెలిపారు.‘‘2006లో ఓ గోల్ఫ్‌ టోర్నమెంట్‌తో తొలిసారి ట్రంప్‌ను కలిశాను. అప్పటికి నేను పోర్న్‌స్టార్‌గా నటిస్తున్నా. ట్రంప్‌ నాతో మాట్లాడారు. తర్వాత ఆయన అంగరక్షకుడి ద్వారా డిన్నర్‌కు ఆహ్వానం అందింది. ట్రంప్‌ హోటల్‌ గదికి వెళ్లాను. అప్పుడు ఆయన సిల్క్‌ దుస్తుల్లో ఉన్నారు. ఆయన వస్త్రధారణ చూసి నాకు నవ్వొచ్చింది. దాంతో ఆయన షర్ట్‌, ప్యాంట్‌ వేసుకున్నారు. నేను బాత్రూమ్‌కు వెళ్లాను. తిరిగి వచ్చేసరికి ఆయన టీషర్ట్‌, షార్ట్‌లోకి మారిపోయారు. అప్పుడే ట్రంప్‌ భార్య ప్రస్తావన వచ్చింది. అందుకు ఆయన అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తాను, తన భార్య ఒకే గదిలో ఉండటం లేదని చెప్పారు. కండోమ్‌ లేకుండానే ట్రంప్‌ నాతో శృంగారంలో పాల్గొన్నారు. ఆ సమయంలో నా వయసు 27 ఏళ్లు.. ట్రంప్‌ వయసు నా తండ్రి కంటే ఎక్కువ ఉంటుందేమో’’ అంటూ వివరంగా ఆ రోజు ఏం జరిగిందో 45 ఏళ్ల స్టార్మీ డేనియల్స్‌ చెప్పారు. ట్రంప్‌తో సంభోగాన్ని బయటపెట్టకుండా ఉండేదుకు 2016 ఎన్నికల సమయంలో 1,30,000 డాలర్ల మొత్తాన్ని ట్రంప్‌ న్యాయవాది మైఖేల్‌ కోహెన్‌ నుంచి స్వీకరించానని తన వాంగ్మూలంలో ఆమె పేర్కొన్నారు. అయితే, ట్రంప్‌ నుంచి డబ్బులు వసూలు చేయడం తన ఉద్దేశం కాదన్నారు. ఆమె చేసిన ఆరోపణలను ట్రంప్‌ తరఫున న్యాయవాదులు తోసిపుచ్చారు. కేవలం డబ్బుల కోసమే మాజీ అధ్యక్షుడిపై ఆమె తప్పుడు ఆరోపణలు చేస్తోందని వాదించారు. ఇలా సుదీర్ఘ సమయం ఇరుపక్షాల వాదనలు కొనసాగాయి. హష్‌మనీకి సంబంధించిన కేసుపై న్యూయార్క్‌ న్యాయస్థానం కొన్ని రోజులుగా విచారణ చేస్తోంది. స్టార్మీ డేనియల్స్‌ వాంగ్మూలం ఇస్తున్న సమయంలో మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ కూడా కోర్టు గదిలోనే ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని