ఆస్ట్రేలియాలో చదువుకు బ్యాంకులో రూ.16 లక్షలు ఉండాల్సిందే

వలసలను కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తోన్న ఆస్ట్రేలియా.. ఉన్నత చదువుల కోసం వచ్చే విదేశీ విద్యార్థులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.

Published : 09 May 2024 04:05 IST

రేపటి నుంచి అమల్లోకి కొత్త నిబంధన

ఇంటర్నెట్‌ డెస్క్‌: వలసలను కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తోన్న ఆస్ట్రేలియా.. ఉన్నత చదువుల కోసం వచ్చే విదేశీ విద్యార్థులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. వీసా కోసం దరఖాస్తు చేసుకునే విదేశీ విద్యార్థుల కనీస బ్యాంకు నిల్వ మొత్తాన్ని 29,710 ఆస్ట్రేలియన్‌ డాలర్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మొత్తం సుమారు రూ.16,35,000కు సమానం. కొత్త నిబంధన ఈ నెల 10 నుంచి అమల్లోకి రానుంది. ఉన్నత విద్య నిమిత్తం ఆస్ట్రేలియా వెళ్లే విద్యార్థులు.. అక్కడ ఏడాది నివాసానికి అయ్యే ఖర్చుల మొత్తాన్ని తమ ఖాతాలో ఉన్నట్లు చూపెట్టాల్సి ఉంటుంది. ఈ వీసా డిపాజిట్‌ కనీస పరిమితి గతంలో 21,041 ఆస్ట్రేలియన్‌ డాలర్లుగా ఉండేది. గతేడాది అక్టోబరులో దానిని 24,505 ఆస్ట్రేలియన్‌ డాలర్లకు పెంచగా.. తాజాగా 29,710 ఆస్ట్రేలియన్‌ డాలర్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని