తెలంగాణలోనూ ‘గులాబ్‌’ ప్రభావం

ప్రధానాంశాలు

తెలంగాణలోనూ ‘గులాబ్‌’ ప్రభావం

  మామకన్ను గ్రామంలో 12 గంటల్లో 13 సెంటీమీటర్ల వర్షం

  నేడు, రేపు అతి భారీ వర్షాలు

ఈనాడు, హైదరాబాద్‌, అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. దీనికి గులాబ్‌ అని పేరుపెట్టారు. కళింగపట్నానికి ఈశాన్య దిశలో 440 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఆదివారం సాయంత్రం గోపాల్‌పుర్‌-కళింగపట్నం మధ్య తీరం దాటనుందని వాతావరణశాఖ ప్రకటించింది. అందులో... ‘తుపాన్‌ ప్రభావం ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం ప్రాంతాలపై ఎక్కువగా ఉంటుంది. మిగిలిన కోస్తా జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. తీర ప్రాంతాల్లో గంటకు 75 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. రాగల 24 గంటల్లో ఒడిశా, ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, దక్షిణ కోస్తా జిల్లాలతోపాటు తెలంగాణ, విదర్భ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయి. తుపాను ప్రభావంతో ఆది, సోమవారాల్లో తెలంగాణలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. శనివారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం మామకన్నులో 12.3, పోచంపల్లి (కరీంనగర్‌)లో 6.3, కూనారం (పెద్దపల్లి)లో 6, అవునూరు (రాజన్న సిరిసిల్ల)లో 6, సంగారెడ్డిలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. శనివారం రాత్రి కూడా పలుచోట్ల వర్షాలు కురిశాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని