ఏపీలో అలజడి సృష్టికి తెదేపా యత్నం: విజయసాయిరెడ్డి

ప్రధానాంశాలు

ఏపీలో అలజడి సృష్టికి తెదేపా యత్నం: విజయసాయిరెడ్డి

ఈనాడు, దిల్లీ: జనాకర్షక ముఖ్యమంత్రిపై దుర్భాషలాడి ప్రజలు రెచ్చిపోయేలా చేసి ఏపీలో అలజడి సృష్టించాలనేది తెదేపా ప్రయత్నమని వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘తెదేపా కార్యాలయాలపై దాడులు ఎందుకుజరిగాయో రాష్ట్రపతికి చంద్రబాబు వివరిస్తే బాగుండేది. 2019 నుంచి వరుసగా శాసనసభ, పార్లమెంట్‌, పురపాలక, పంచాయతీ ఎన్నికల్లో తెదేపాను ప్రజలు పూర్తిగాతిరస్కరించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో అధికారం దక్కించుకోవడంలో విఫలమైన ఆ పార్టీ నాయకులు అప్రజాస్వామికంగా, అక్రమంగా ఆర్టికల్‌ 356 ఉపయోగించాలని డిమాండ్‌ చేస్తున్నారని’ పేర్కొన్నారు. సీఎంపై తెదేపా నేతలు దుర్భాషలాడుతున్నారని, వారిని చంద్రబాబు మరింత ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. తెదేపా చెత్తరాజకీయాలపై ప్రజా గ్రహ ఫలితమే ఆ పార్టీ కార్యాలయాలపై దాడులన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని