గడువులోగా పోలీస్‌ కార్యాలయ భవనాలు
close

ప్రధానాంశాలు

గడువులోగా పోలీస్‌ కార్యాలయ భవనాలు

నిర్మాణ పనుల సమీక్షలో హోంమంత్రి ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: జిల్లా పోలీస్‌ కార్యాలయ భవనాలు, కమిషనరేట్ల నిర్మాణ పనుల్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని హోంమంత్రి మహమూద్‌ అలీ ఆదేశించారు. పనుల పురోగతిపై తన కార్యాలయంలో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. రామగుండం కమిషనరేట్‌తోపాటు గద్వాల, సూర్యాపేట, ఆసిఫాబాద్‌, సిరిసిల్ల, నాగర్‌కర్నూల్‌, భూపాలపల్లి, వనపర్తి, మహబూబాబాద్‌, కొత్తగూడెం, జగిత్యాల జిల్లా పోలీస్‌ కార్యాలయ భవనాలను గడువులోగా తప్పనిసరి పూర్తి చేయాలన్నారు. ఆయా కార్యాలయ సముదాయాల్లో పోలీస్‌ అధికారుల నివాసాల కోసం ఎనిమిది చొప్పున భవనాలను నిర్మించాలని సూచించారు. మేడిపల్లిలో రాచకొండ కమిషనరేట్‌ నిర్మాణ పనుల్ని త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. నారాయణపేట, ములుగులో భవనాల నిర్మాణం కోసం ప్రతిపాదనలు రూపొందించాలని చెప్పారు. సమీక్షలో పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కోలేటి దామోదర్‌, హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవిగుప్తా, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని