రవాణా మంత్రి కాన్వాయ్‌లోని వాహనానికి ప్రమాదం

ప్రధానాంశాలు

రవాణా మంత్రి కాన్వాయ్‌లోని వాహనానికి ప్రమాదం

నకిరేకల్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కాన్వాయ్‌లోని ఒక వాహనానికి ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంత్రి మంగళవారం ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఆయన కాన్వాయ్‌లోని చిట్టచివరి వాహనాన్ని నల్గొండ జిల్లా నకిరేకల్‌ సమీపంలో 65వ నంబర్‌ జాతీయ రహదారి బైపాస్‌పై పాల ట్యాంకర్‌ ఢీకొట్టింది. ట్యాంకర్‌ అండర్‌పాస్‌ రహదారి నుంచి బైపాస్‌పైకి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో వాహనం ముందుభాగం ధ్వంసమైంది. అందులో ఉన్న డ్రైవర్‌, నలుగురు సిబ్బంది క్షేమంగా బయటపడ్డారు. ట్యాంకర్‌ డ్రైవర్‌ అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందని కాన్వాయ్‌ డ్రైవర్‌ గోపికృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నకిరేకల్‌ సీఐ. కె.నాగరాజు తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని