TS News: వీరందరి పయనమెటు..?

ప్రధానాంశాలు

TS News: వీరందరి పయనమెటు..?

2019తో పోల్చితే ఇంటర్‌ ఉత్తీర్ణులు లక్షన్నర మందికి పైగా అధికం
ఎంసెట్‌కు ఇప్పటికే పెరిగిన దరఖాస్తులు

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో ఈసారి పరీక్ష ఫీజులు చెల్లించిన 4.73 లక్షల మందీ ఉత్తీర్ణులు కావడంతో వీరంతా ఈసారి ఏ కోర్సుల్లో చేరతారు? అన్న ప్రశ్న తలెత్తుతోంది. కేవలం ఇంటర్‌ జనరల్‌ కోర్సులతో గత ఏడాది కంటే ఈసారి దాదాపు 33వేల మంది.. 2019తో పోల్చుకుంటే సుమారు 1.60 లక్షల మంది ఎక్కువగా ఉత్తీర్ణత పత్రాలతో బయటకు వస్తున్నారు. ఇక ఒకేషనల్‌ కోర్సుల్లో ఉత్తీర్ణులు, ప్రైవేట్‌ విద్యార్థులు(గతంలో ఒకసారి తప్పినవారు) ఇంకా వేల మంది ఉండనున్నారు.

ఏటా 2.30 లక్షల నుంచి 2.50 లక్షల మంది సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో చేరుతున్నారు. మరో 70వేల మంది వరకు రాష్ట్రంలో బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొందుతున్నారు. మిగిలిన వారు ఎంబీబీఎస్‌, వెటర్నరీ, బీఎస్‌సీ అగ్రికల్చర్‌, బీఫార్మసీ, ఐఐటీలు, ఎన్‌ఐటీలు, అయిదేళ్ల న్యాయ విద్య కోర్సు(బీఎల్‌ఎం), బీఎస్‌సీ నర్సింగ్‌ తదితర కోర్సులను ఎంచుకుంటున్నారు. ఈసారి ఇప్పటికే ఎంసెట్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌కు 2.38 లక్షల దరఖాస్తులు అందాయి. గత ఏడాది కంటే ఇది 15వేలు ఎక్కువ. ఇంకా గడువు ఉన్నందున మరో 5వేలు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. వీరంతా ఎంసెట్‌కు దరఖాస్తు చేసినా చివరకు సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లోనే చేరవచ్చనేది నిపుణుల అంచనా. ‘గత ఏడాది దాదాపు 25వేల మంది డిగ్రీ కోర్సుల్లో పెరిగారు. ఈసారి ఆ సంఖ్య మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నాం’ అని ‘దోస్త్‌’ కన్వీనర్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని