ఇంట్లోనే సులువుగా చేసేద్దాం!
close
Updated : 01/08/2021 05:23 IST

ఇంట్లోనే సులువుగా చేసేద్దాం!

అమ్మాయిలు... జిమ్‌కో, పార్కుకో వెళ్లి వ్యాయామం చేయాలంటే బద్ధకిస్తారు. ప్రస్తుతం కరోనా వల్ల ఆ పరిస్థితులూ లేవు. ఇలాంటప్పుడు ఈ కసరత్తులను ప్రయత్నిస్తే... ఇంట్లోనే ఒంట్లోని కొవ్వుని కరిగించుకోవచ్చు. శరీరాకృతిని తీర్చిదిద్దుకోవచ్చు... ఆరోగ్యంగానూ ఉండొచ్చు.

జంపింగ్‌ జాక్స్‌: ఉన్న చోటే ఎగిరి దూకండి. ఓ నిమిషం పాటు అలానే చేయండి. దీనివల్ల సులువుగా కెలొరీలు ఖర్చవుతాయి. ఇలా చేయడానికి ప్రత్యేకించి నైపుణ్యాలు అక్కర్లేదు. ఇది చక్కటి కార్డియో వ్యాయామం.

ఉన్నచోటే పరుగు: వాకింగ్‌, జాగింగ్‌ల కోసం పార్కుకే వెళ్లాల్సిన పనిలేదు. ఉన్న చోటే నిలబడి..ట్రెడ్‌మిల్‌ తరహాలో పరుగుతీయండి. గట్టిగా ఉండే నేల మీద మంచి బూట్లతో చేస్తే సరి.

కిక్‌ బాక్సింగ్‌: మీరు విన్నది నిజమే. ఇది కూడా చక్కటి వ్యాయామ మార్గం. మీరు చేయాల్సిందల్లా... కాళ్లు, చేతులతో గాల్లోకి పిడిగుద్దులు విసరడం. దీనిలో భాగంగా కాళ్లనూ, చేతులను వీలైనంత ఎక్కువగా స్ట్రెచ్‌ చేయొచ్చు. ఇది శరీరం సౌకర్యంగా సాగేలా చేస్తుంది. గుండెకూ మంచిది.

మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

తరువాయి

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని