నాన్న ఇచ్చిన ఆస్తులవే!
close
Published : 29/08/2021 01:27 IST

నాన్న ఇచ్చిన ఆస్తులవే!

‘తెరిచిన పుస్తకం’- శ్రుతి హాసన్‌ గురించి తెలిసినవాళ్లు చెప్పే మాటిది. మనసులోనే కాదు.. తన జీవితంలో జరిగే దేన్నీ దాచుకోదు మరి! సూటిగా మాట్లాడటం.. సొంతంగా తన కాళ్లపై తాను నిలబడాలనే పట్టుదల.. తప్పొప్పులతో సంబంధం లేకుండా తన నిర్ణయాలపై దృఢంగా నిలబడగలిగే తత్వం ఆమె సొంతం. అందుకే.. తండ్రికి వారసులిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టినా.. శ్రుతిగానే అందరికీ దగ్గరైంది. ఆమెను తాజాగా ‘వసుంధర’ పలకరించింది.

లాక్‌డౌన్‌ తర్వాత తిరిగి సినిమా సెట్‌లోకి అడుగుపెట్టడం చాలా బాగుంది. భయమంతా పోయిందని అబద్ధమైతే చెప్పను. కానీ.. ఎన్నాళ్లని భయపడుతూ కూర్చుంటాం. నాకూ కొన్ని ఆర్థిక అవసరాలుంటాయి కదా! ఇది వినగానే చాలామంది ‘అదేంటండీ, మీకు ఆర్థిక ఇబ్బందులేంటి’ అని ఆశ్చర్యపోతారు. ‘మీరు స్టార్‌ కదా!’ అంటారు. సంపాదించే మొత్తాల్లో తేడా ఉంటుంది కానీ నేనూ బిల్స్‌ చెల్లించాలి. అందుకు డబ్బులు కావాలిగా! ‘కమల్‌ హాసన్‌ తనయ..’ అని విన్నప్పుడు చాలా బాగుంటుంది. నేనూ సగటు ఆడపిల్లలాగే నాన్న కూతుర్ని అనిపించుకోవడానికి ఇష్టపడతాను. కానీ అన్నింటికీ ఆయనపై ఆధారపడటం నచ్చదు. అందుకే మొదటి సినిమా తర్వాత ఎప్పుడూ నాన్నని డబ్బు అడగలేదు. ఖర్చు పెట్టే ప్రతి రూపాయీ నేను సంపాదించిందే. ఆయన నుంచి ప్రేమ, ధైర్యం, కరుణలను మాత్రం ఆస్తులుగా తెచ్చుకున్నా.

నా తీరిదీ!

అందరిలాగే నేనూ. నా జీవితంలో జరిగే ప్రతిదీ అందరితో పంచుకుంటా. దేన్నయినా గోప్యంగా ఉంచాల్సిన అవసరమేముంది అనుకుంటా. అందుకనే నా  ప్రేమ దగ్గర్నుంచి బ్రేకప్‌, కాస్మెటిక్‌ సర్జరీ, డిప్రెషన్‌, పీసీఓడీ..ఇలా దేన్నీ దాయలేదు. అలాగని వేరే వాళ్లు అలా లేకున్నా తప్పు పట్టను. నా వరకూ వందశాతం నచ్చినట్లుగా ఉండటానికే ప్రయత్నిస్తా. ఏదయినా నిజాయతీగా చేయాలనుకుంటా. స్టార్‌ కూతురిగా కంటే స్వతంత్ర మహిళ అనిపించుకోవడానికే ఇష్టపడతా. ఈ కారణంగానే వృత్తిపరంగా నాన్న సాయం ఎప్పుడూ తీసుకోలేదు. ఏం చేస్తున్నానో చెబుతుంటా. ఫలానా పని చేయాలా వద్దా అని సలహాలడగను. ఆయనా మేం ఏకరువు పెట్టాలనుకోరు. స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవడం, స్వతంత్ర భావాలతో బతకడం నాన్నే మాకు నేర్పించారు.

ఆ ఆలోచనతో వచ్చా..

రెండు సినిమాలు చేసి, ఆ డబ్బుతో రాక్‌ బ్యాండ్‌ ప్రారంభించాలన్నది నా ఆలోచన. కానీ వచ్చాక దీనిపై ఇష్టం పెరిగింది. జీవితం పరుగు పందెం కాదన్న సంగతీ ఇక్కడికొచ్చాకే అర్థమైంది. అప్పట్నుంచి ప్రతి రోజునీ, చేసే ప్రతి పాత్రనీ ఆస్వాదించడం అలవాటు చేసుకున్నా. అందుకే ఈ రోజు నేనేం నేర్చుకోవచ్చనే ఆలోచిస్తా తప్ప, అందరికంటే ముందుండాలి, ఎక్కువ సినిమాలు ఒప్పుకోవాలనుకోను. కాకపోతే వ్యక్తిగా ప్రతిరోజూ ఇంకా ఉత్తమంగా అవ్వాలని మాత్రం అనుకుంటా. ఈ పన్నెండేళ్ల సినీ ప్రయాణంలో నా కెరీర్‌లో నాకు మంచి పాత్రలు దక్కింది తెలుగులోనే. అందుకే టాలీవుడ్‌కి నా మనసులో ప్రత్యేకమైన స్థానం. ఇక్కడ నేను చేసిన ప్రతి సినిమా నా హృదయానికి దగ్గరైందే. వాటిలో అందరూ కమర్షియల్‌ కథానాయికనే చూశారేమో కానీ, నా వరకూ అవి అందమైన మహిళా పాత్రలు. ఇటీవల ‘క్రాక్‌’లో తల్లిగా, భార్యగా బలమైన మహిళగా కనిపించా. స్వతహాగా నాకు యాక్షన్‌ సినిమాలంటే ఇష్టం. ఫిట్‌నెస్‌పై మక్కువ ఎక్కువ. అందుకే ఈ పాత్ర సహజంగా కనిపిస్తుంది. కలల పాత్రలంటూ ప్రత్యేక కోరికలేమీ పెట్టుకోను. కానీ.. సంగీతకారిణిగా చేసే అవకాశమొస్తే మాత్రం అస్సలు వదులుకోను.

అవి ఎదురైనపుడు..

తారలన్నాక రూమర్లు సహజం. అలాగే అమ్మానాన్నా విడిపోవడం దగ్గర్నుంచి.. నా మేకప్‌ వరకూ ప్రతిదాన్నీ ప్రశ్నిస్తారు. కానీ నేనవేమీ పట్టించుకోను. అమ్మానాన్నా విడిపోయినందుకు నాకేం బాధ లేదు. వాళ్లిద్దరూ మంచివాళ్లు, మమ్మల్ని బాగా చూసుకుంటారు. కలిసి జీవించలేకపోయారంతే. మిగతాదంతా అందరిలాగే. డిప్రెషన్‌లోకి వెళ్లినపుడు ఎన్నో వ్యతిరేక కామెంట్లు, ఓసారి నల్ల లిప్‌స్టిక్‌ వేసుకున్నానని దూషించారు. ఇంకా ఎన్నో వచ్చాయి. అన్నీ విని ఊరుకుంటా లేదా వాటిలో పాజిటివిటీ వెతుకుతా. పెదాలకు నలుపు వేసుకుంటే తిట్టారు, ఎరుపు వేసుకున్నంత మాత్రాన నాకేం ప్రైజ్‌ ఇవ్వట్లేదు కదా! ఇదీ అంతే అని వదిలేస్తా. అందరికీ సమాధానం చెప్పాల్సిన పని లేదని నా అభిప్రాయం.

రహస్యాలుండవు..

‘పెళ్లి ఎప్పుడు?’ ఈమధ్య ఎవరితో మాట్లాడినా ఇదే ప్రశ్న. ముందే చెప్పినట్టు నా దగ్గర రహస్యాలేమీ ఉండవు. పెళ్లి చేసుకోవాలనిపిస్తే మరుక్షణమే అందరికీ చెప్పేస్తా. ప్రస్తుతానికైతే ఆ ఆలోచనలేమీ లేవు. శాంతను హజారికా నా బెస్ట్‌ ఫ్రెండ్‌. తను ప్రతిభగల ఆర్టిస్ట్‌. సంగీతం, కళలు, సినిమాల పరంగా మా ఇద్దరి అభిరుచులు కలిశాయి. తనతో కలిసి సమయం గడపడం చాలా ఇష్టం. తనపై నాకు ఎంతో గౌరవం కూడా.

ప్రస్తుతం.. సలార్‌లో ప్రభాస్‌తో కలిసి నటిస్తున్నా. తన ఆతిథ్యం గురించి విన్నా కానీ ఈ సినిమాతో అనుభవంలోకి వచ్చింది. తను రోజూ పంపే వంటకాలను చూసి నన్ను నేను నియంత్రించుకోలేకపోయా. ప్రేమతో కూడిన ఆతిథ్యం తనది. దీంతోపాటు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో కోసం ఓ హిందీ సిరీస్‌నూ చేస్తున్నా.

- నర్సిం ఎర్రకోటమరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

తరువాయి

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

తరువాయి

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని