నా భర్తను ఎలా మార్చుకోవాలి? - how to change my husband attitude in telugu
close
Updated : 18/10/2021 19:02 IST

నా భర్తను ఎలా మార్చుకోవాలి?

(Image for Representation)

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఆరు నెలలవుతోంది. మాది ప్రేమ వివాహం. ఇంట్లో అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. మా అత్తయ్య వాళ్లు కూడా పెళ్లికి ఒప్పుకున్నందుకు చాలా సంతోషించాను. వాళ్లని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలనుకున్నాను. కానీ ఆవిడ మాత్రం నన్ను చాలా బాధపెడుతోంది. ఎలా అంటే నా భర్తతో ఎక్కువ సమయం గడపనివ్వదు. మేమిద్దరం ఎక్కడికైనా వెళ్తే మొహం మాడ్చుకొని కూర్చుంటుంది. అలాగే నా భర్తతో కలిసి మా పుట్టింటికి వెళ్లినా పదే పదే నా భర్తకి ఫోన్‌ చేసి ఏదో ఒకటి అంటుంది. దాంతో నా భర్త నన్ను బయటికి, మా పుట్టింటికి తీసుకెళ్లడమే మానేశాడు. నా భర్త కూడా వాళ్ల మాటలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నాడు. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లమంటే వద్దంటున్నాడు. కానీ, నా భర్తకు నేనంటే చాలా ఇష్టం. ఏకాంతంగా ఉన్నప్పుడు నాతో చాలా బాగా మాట్లాడతాడు. కానీ నలుగురిలో ఉన్నప్పుడు అస్సలు మాట్లాడరు. మా ఆయన మా అత్తింటి వాళ్లు చెప్పినట్లల్లా చేయడం కాస్త బాధగా అనిపిస్తోంది. నా బాధని ఆయనతో పంచుకుందామనుకుంటే ఏమనుకుంటారోనని భయంగా ఉంది. ఈ సందిగ్ధంలో ఏం చేయాలో పాలుపోవట్లేదు. సలహా ఇవ్వండి. - ఓ సోదరి

జ. ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు కొన్ని సమస్యలు రావడం సహజం. అయితే మీ ఇద్దరి మధ్య తగినంత సాన్నిహిత్యం, చనువు ఏర్పడలేదని మీ ఉత్తరం సూచిస్తోంది. మీరిద్దరూ మానసికంగా మరింత దగ్గరైనప్పుడు ఒకరి మనసులోని భావాలను మరొకరితో చెప్పుకోవడమనేది పెద్ద విషయమేమీ కాదు. అతను ఏమనుకుంటున్నాడో అన్న సంకోచం మీకు, మీతో చనువుగా ఉండడం వల్ల తన తల్లిదండ్రులు ఏమనుకుంటారో అన్న సంకోచం తనకు ఉన్నాయా? అన్న విషయాన్ని పరిశీలించండి. ఇది కూడా మీ మధ్య అగాథాలు సృష్టించే అవకాశం ఉంటుంది.

మీ భర్త మీతో ఏకాంతంగా ఉన్నప్పుడు బాగానే ఉంటున్నాడని చెబుతున్నారు. కాబట్టి, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే మీరు కొత్తగా పెళ్లైన జంట కాబట్టి వారాంతాల్లో లేదా సమయం కుదిరినప్పుడు బయటకు వెళ్లండి. అయితే ఇది వారికి ఆమోదయోగ్యం కాకపోయినా సమయం కుదిరినప్పుడు మీరు బయటకు వెళ్తారన్న విషయాన్ని, అలాగే మీరిద్దరూ చనువుగా ఉండాల్సినటువంటి అవసరాన్ని వాళ్లకు అర్ధమయ్యేలా వివరించండి.

అయితే ఇన్నేళ్లు ఆ అబ్బాయితో అలవాటైన వ్యవహారశైలి ఇప్పుడు ఒక్కసారిగా మారిపోవడం కూడా వారికి ఇబ్బందిగా అనిపించే అవకాశం లేకపోలేదు. అయితే అది కూడా జీవితంలో భాగమేనన్న విషయం వారికి చిన్న చిన్న చర్యల ద్వారా అవగాహన కల్పించే ప్రయత్నం చేయండి. అలాగే అతనితో కూడా భార్యతో కొంత వ్యక్తిగత సమయం గడపాలన్న విషయాన్ని తెలియజేయండి. అది మీ భవిష్యత్తుకి, పుట్టబోయే పిల్లలకు కూడా ఉపయోగపడుతుందని అర్థమయ్యేట్టుగా వివరించండి. దీనికోసం మీ బంధువుల్లో దాంపత్య బంధం దృఢంగా ఉన్న వారిని ఉదాహరణగా చూపించండి. తద్వారా సమస్యను పరిష్కరించుకోగలుగుతారేమో చూడండి.


Advertisement


మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

దాని గురించి పుట్టిన వెంటనే తెలిసిపోతుందట!

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని