అతిగా ఆందోళన చెందేవారితో ఎలా ఉండాలంటే...? - how to help a partner with anxiety in telugu
close
Updated : 21/08/2021 20:14 IST

అతిగా ఆందోళన చెందేవారితో ఎలా ఉండాలంటే...?

18ఏళ్ల తపస్వి ఎప్పుడు చూసినా ఆందోళనగా ఉన్నట్లే కనిపిస్తుంది.. చదువుకి సంబంధించిన విషయాల గురించే పదేపదే ఆలోచిస్తూ ఉంటుంది..

28ఏళ్ల శ్రీదివ్య ఒక ఎమ్మెన్సీలో జాబ్ చేస్తోంది. ఆమె కూడా ఎప్పుడు చూసినా తన కుటుంబం, ఉద్యోగం.. ఇలా ఏదో ఒక విషయం గురించి ఆందోళన చెందుతూనే ఉంటుంది..

వీరే కాదు.. మన చుట్టుపక్కల ఉన్న చాలామంది వ్యక్తుల్లో ప్రతి చిన్న విషయానికీ విపరీతంగా ఆలోచించేవారు, ఆందోళన చెందేవారు.. ఎందరో! సాధారణంగా ఇటువంటివారు సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. అందుకే వారితో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు. అందులోనూ ఇప్పుడు ఈ కరోనా వచ్చాక ప్రస్తుతం దాని గురించి అందరిలోనూ విపరీతమైన భయాందోళనలు పెరిగిపోయాయి. మరి, ఇలాంటి వ్యక్తులతో మనం ఎలా మసలుకోవాలి? వారి ఆందోళన తగ్గించడానికి ఏం చేయాలి.. మొదలైన విషయాలను తెలుసుకుందాం రండి..

ఆందోళన.. ఇది పరిమితుల్లో ఉన్నంత వరకు ఒక సహజసిద్ధమైన భావనగానే పరిగణిస్తాం. కానీ ఒక్కసారి పరిధులు దాటితే మాత్రం ఇదొక మానసిక సమస్యగా మారుతుంది. ముఖ్యంగా ఒకే విషయం గురించి అదే పనిగా ఎక్కువగా ఆలోచించడం, కలత చెందడం.. వంటివి దీనికి ప్రధాన లక్షణాలు. ఇవే కాదు..

* ప్రతి చిన్న విషయానికీ బాధపడడం

* రిలాక్స్ అవడానికి ఇష్టపడకపోడం లేదా సాధ్యం కాకపోవడం..

* డల్‌గా అనిపించడం, వూపిరి ఆడనట్లు ఉండడం..

* సరిగా నిద్ర పట్టకపోవడం

* ఏకాగ్రత లోపించడం.. మొదలైనవి కూడా అతిగా ఆందోళన చెందే వ్యక్తుల్లో ప్రధానంగా కనిపించే లక్షణాల్లో కొన్ని.

ఇలా అతిగా ఆందోళన చెందే వ్యక్తుల మనస్తత్వం చాలా వరకు సున్నితంగా ఉంటుంది. కాబట్టి వారితో చాలా జాగ్రత్తగా మసలుకోవాల్సి ఉంటుంది.

చెప్పేది వినండి..

ఆందోళన చెందే సమయంలో ఒక వ్యక్తి మెదడులో ఒకేసారి రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. అంతకుమించి ఎన్నో భావోద్వేగాలు కూడా వారిలో కలుగుతాయి. ఇలాంటి సమయంలో మనసులో ఉన్న బాధ, ఆలోచనల గురించి ఇతరులతో పంచుకుంటే వారికి కాస్త రిలాక్డ్స్‌గా అనిపించే వీలు ఉంటుంది. అందుకే ఎవరైనా ఆందోళన చెందుతున్నట్లు మీకు అనిపిస్తే మొదట వారి మనసులో ఉన్న బాధ, ఆలోచనలు ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఫలితంగా వారు కూడా కాస్త ఆ బాధ/ ఆలోచనల నుంచి తేరుకునే అవకాశం ఉంటుంది. అలాగే వారు చెప్పేదానిని బట్టి మనం ఎలా స్పందించాలనే విషయంలో కూడా మనకు ఒక అవగాహన ఏర్పడుతుంది.

తోడుగా ఉండండి..

ఆందోళన చెందే వ్యక్తుల్లో చాలా వరకు కాసేపటి తర్వాత ఎదుటి వ్యక్తి మాటలకు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటారు. కానీ కొందరు మాత్రం అలాకాదు.. అలాంటి వారు నిపుణుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. అటువంటప్పుడు వారిని ఒంటరిగా పంపించడం కాకుండా మీరూ వారికి తోడుగా వెళ్లండి. తద్వారా 'నీకు ఎల్లవేళలా నేను తోడున్నా..' అనే నమ్మకాన్ని వారిలో కలిగించే వీలు ఉంటుంది. ఇలా ఏర్పడే నమ్మకం కారణంగా మనం చెప్పే మాటలు కూడా వారి మనసుని బాగా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఇవి వారిని సాధారణ స్థితికి తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.

సహనంతో మెలగండి..

సాధారణ స్థితిలోనే మనం చెప్పే మాట ఎదుటి వ్యక్తి వినకపోవచ్చు.. అలాంటిది అతిగా ఆందోళన చెందే వ్యక్తులు కూడా చెప్పిన వెంటనే మన మాట వినాలని ఆశించకూడదు. ఒకటికి పదిసార్లు వారికి నచ్చచెప్పాలి. మన మాట వినేలా చేసుకోవడానికి అవసరమయ్యే సహనాన్ని కలిగి ఉంటూనే వారిలోనూ మానసిక ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేయాలి. మనలో ఉన్న సహనం కూడా వారిలో మార్పు తీసుకురావడానికి ఉపయోగపడే సాధనమే అని గుర్తుంచుకోవాలి.

నిర్ణయాలు వద్దు..!

అతిగా ఆందోళన చెందే వ్యక్తులకు సాధారణ సమయాల్లో నిర్ణయాత్మక శక్తి బాగానే ఉంటుంది. కానీ ఏదైనా విషయం గురించి లోతుగా ఆలోచించేటప్పుడు లేదా ఆందోళనకి గురైనప్పుడు మాత్రం వారు తమ నిర్ణయాత్మక శక్తిని కోల్పోయే అవకాశాలున్నాయి. అందుకే ఆ సమయంలో వారు దేనికి సంబంధించైనా సరే ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తపడాలి. మరీ అవసరమైతే వారికి బదులుగా వారి సమక్షంలో వారి సమ్మతితోనే మీరే నిర్ణయాలు తీసుకోవడం కూడా మంచిదే.

ఏ విధంగా సహాయపడాలి?

ఆందోళన చెందే వ్యక్తికి మన సహాయం ఏ విధంగా అవసరమో వారినే అడిగి తెలుసుకోవాలట! వారిని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ఇది కూడా చాలా వరకు తోడ్పడుతుందంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు. వారి మనోభావాలు పంచుకోవడం, సరదాగా కలిసి బయటకు వెళ్లడం, పాటలు వినడం.. ఇలా వారికి నచ్చే పనుల్లో తోడు ఉండడం ద్వారా మానసికంగా వారిలో మరింత త్వరగా మార్పు వస్తుందట! ఫలితంగా వారు ఆందోళన నుంచి సత్వరమే బయటపడే వీలుంటుంది.

ఇలా చేయద్దు..!

* సాధారణంగా ఆందోళన చెందే వ్యక్తులను చూడగానే 'రిలాక్స్.. రిలాక్స్..' అంటూ వారిని సాధారణ స్థితికి తీసుకురావడానికి వారిపై ఎంతో కొంత ఒత్తిడి కలిగిస్తాం. ఇది సరైంది కాదు.

* అతిగా ఆందోళన చెందే వ్యక్తులను దూరం పెట్టడం లేదా వారి నుంచి తప్పించుకుని తిరగడం.. ఇలాంటివేవీ మనం చేయకూడదు. అంతేకాదు.. ఒకసారి తలెత్తిన ఆందోళన దానంతట అదే తగ్గిపోతుందని వదిలేయడం కూడా సమంజసం కాదంటున్నారు నిపుణులు. వారికి మన తోడు, ప్రేమ, సహాయం.. వంటివి అందించడం ద్వారానే తిరిగి సాధారణ స్థితికి తీసుకువచ్చే వీలు ఉంటుంది.



మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

దాని గురించి పుట్టిన వెంటనే తెలిసిపోతుందట!

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని