పాలంటే ఇష్టం లేదా.. అయితే ఈ ఓట్ మిల్క్‌ ట్రై చేయండి! - making of oat milk and its health benefits
close
Published : 18/08/2021 16:40 IST

పాలంటే ఇష్టం లేదా.. అయితే ఈ ఓట్ మిల్క్‌ ట్రై చేయండి!

‘సంపూర్ణ ఆహారం’ అని పేరున్నప్పటికీ చాలామంది పాలు తాగడానికి ఇష్టపడరు. కడుపులో తిప్పడం, ఇబ్బందిగా అనిపించడం, వికారంగా అనిపించడం, రుచి బాగోలేకపోవడం...ఇలా రకరకాల కారణాలతో పాలను పక్కన పెడుతుంటారు. ఇక వీగన్లుగా మారిన వారు కూడా పాలను దూరం పెట్టేస్తుంటారు. అయితే పాలు తాగకపోయినా అందులోని పోషకాలను పొందేందుకు పలు ప్రత్యామ్నాయ మార్గాలున్నాయి.  అందులో ఓట్‌ మిల్క్‌ కూడా ఒకటి.

ల్యాక్టోస్‌తో ఇబ్బంది పడే వారికి..

సాధారణ పాలల్లో ల్యాక్టోస్‌ అధికంగా ఉంటుంది. ఇది చాలామందిలో కడుపుబ్బరం, కడుపునొప్పి, డయేరియా తదితర సమస్యలకు కారణమవుతుంది. ఈ నేపథ్యంలో ల్యాక్టోస్‌తో ఇబ్బంది పడేవారికి ఓట్ మిల్క్ మంచి ప్రత్యామ్నాయ మంటున్నారు నిపుణులు. డెయిరీ ఉత్పత్తులు పడనివారు కూడా దీనిని ఆహారంగా తీసుకోవచ్చని సూచిస్తున్నారు. మరి ఇన్ని ప్రయోజనాలున్న ఈ ఓట్ మిల్క్‌ను ఇంట్లోనే తయారుచేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం రండి.

ఓట్‌ మిల్క్

కావాల్సిన పదార్థాలు

* నానబెట్టిన జీడిపప్పులు - 12 లేదా 25 గ్రాములు

* రోల్డ్‌ ఓట్స్ - ఒక కప్పు

* చల్లని నీరు - ఒక లీటరు

తియ్యదనం కోసం

* దాల్చిన చెక్క పొడి – అర టీస్పూన్

* వెనిలా ఎసెన్స్‌ - 7 నుంచి 8 చుక్కలు

తయారీ విధానం

రోల్డ్‌ ఓట్స్‌, జీడిపప్పును మిక్సీలో వేసి 10 సెకన్ల పాటు గ్రైండ్‌ చేయాలి. ఆ తర్వాత చల్లటి నీటిని కలిపి మరో 20 సెకన్ల పాటు గ్రైండ్‌ చేయాలి. చివరిగా మస్లిన్‌ క్లాత్‌ సహాయంతో ఈ మిశ్రమాన్ని వడకట్టుకుంటే ఓట్‌మిల్క్‌ సిద్ధం. పాలకు తియ్యదనం వచ్చేందుకు దాల్చిన చెక్కపొడి, వెనిలా ఎసెన్స్‌ను కలుపుకోవచ్చు.

ఓట్‌ మిల్క్‌ బాగా రావాలంటే..!

* జీడిపప్పును ఎక్కువ సేపు నీటిలో నానబెట్టకూడదు.

* ఓట్స్‌, జీడిపప్పులను మిక్సీలో ఎక్కువ సమయం గ్రైండ్‌ చేయకూడదు.

* చల్లని నీటిని కలపడం వల్ల గ్రైండ్‌ చేసేటప్పుడు ఓట్స్‌ వేడెక్కకుండా నియంత్రించవచ్చు.

* నీటిలో నానబెట్టిన జీడిపప్పు పాలల్లో అధిక క్రీమ్‌ వచ్చేందుకు సహాయపడతాయి.

* ఈ పాలను 3-4 రోజుల పాటు ఫ్రిజ్లో నిల్వచేసుకోవచ్చు. సాధారణ పాలలాగే వీటితోనూ టీ, కాఫీలు, చాక్లెట్లు, మిల్క్‌షేక్‌లు తయారుచేసుకోవచ్చు.

 

ఆరోగ్య ప్రయోజనాలివే!

* ఓట్‌ మిల్క్‌లో శరీరానికి అవసరమైన ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి.

* ఈ పాలల్లో కొవ్వులు, క్యాలరీలు చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి ఆహారం.

* ఇందులోని బీటా గ్లూకాన్‌ అనే ఫైబర్‌ జీవక్రియ సమస్యలను తగ్గించడంలో బాగా సహాయపడుతుంది.

* ఓట్‌ మిల్క్‌లోని విటమిన్‌-బి, ఫోలేట్, ఇతర పోషకాలు ఎర్ర రక్తకణాల పనితీరును మెరుగుపరుస్తాయి.

* ఇందులోని విటమిన్‌-ఎ, డి, క్యాల్షియం, ఐరన్‌, పొటాషియం, మెగ్నీషియం, జింక్‌ పలు అనారోగ్య సమస్యల నుంచి రక్షణ కల్పిస్తాయి. ముఖ్యంగా క్యాల్షియం, విటమిన్‌-డి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి ఆస్టియోపొరోసిస్‌ లాంటి సమస్యలను నిరోధిస్తాయి.

* ఓట్‌ మిల్క్‌లోని బీటా గ్లూకాన్‌ రక్తంలో చక్కెర స్థాయులను అదుపులో ఉంచుతుంది. కాబట్టి మధుమేహ రోగులకు ఇది మంచి ఆహారమని చెప్పుకోవచ్చు.

* ఈ డెయిరీ ఫ్రీ మిల్క్‌ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ (LDL) స్థాయులను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ (HDL) స్థాయులను పెంచుతుంది.

* సాధారణ పాలల్లో మాదిరిగా ఓట్‌ మిల్క్‌లో ల్యాక్టోస్‌ ఉండదు. గ్లూటెన్‌ ఫ్రీ కూడా.

* ఈ పాలను తీసుకోవడం వల్ల చర్మ సౌందర్యం కూడా మెరుగుపడుతుంది. అదేవిధంగా జుట్టు పలచబడకుండా, తెల్లబడకుండా నిరోధిస్తుంది.మరిన్ని

ఇంట్లో పదే పదే తాకే వాటిని ఇలా శుభ్రం చేయాల్సిందే!

ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రోజూ మనం ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లొచ్చినా వ్యక్తిగత శుభ్రత పాటించడం, మనతో పాటు తెచ్చిన వస్తువుల్ని శానిటైజ్‌ చేయడం.. వంటివి కచ్చితంగా పాటిస్తున్నాం.. మరి, మనం ఇంట్లో పదే పదే తాకే వస్తువుల సంగతేంటి? మనం బయటికెళ్లినా అవి ఇంట్లోనే ఉంటున్నాయి కదా.. అంటారా? అయినా సరే.. వాటిని రోజూ శుభ్రం చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. తద్వారా వాటిపై చేరే వైరస్‌, బ్యాక్టీరియా, క్రిములు ఒకరి నుంచి మరొకరికి అంటుకోకుండా జాగ్రత్తపడచ్చు. ఇంతకీ మనం ఇంట్లో తరచూ తాకే ప్రదేశాలు, వస్తువులేంటి? వాటిని ఎలా శానిటైజ్‌ చేయాలి? రండి తెలుసుకుందాం..!

తరువాయి

అందుకే టవల్స్ విషయంలోనూ శుభ్రంగా ఉండాల్సిందే!

ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు రోజులో ఎన్నోసార్లు ముఖాన్ని, చేతుల్ని కడుక్కుంటూ ఉంటాం. ఇలా కడిగిన ప్రతిసారీ కచ్చితంగా టవల్‌తో తుడుచుకోవాల్సిందే. ఇలా మనకు తెలియకుండానే రోజులో చాలాసార్లు టవల్‌ను వాడుతూనే ఉంటాం. మరి, మీరు నిత్యం ఉపయోగించే ఈ టవళ్లు బ్యాక్టీరియాలకు మంచి ఆవాసాలనే విషయం మీకు తెలుసా? కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో - ప్రతి రోజూ మీరు ఉపయోగించే టవల్ విషయంలో ఎంతవరకు జాగ్రత్త వహిస్తున్నారు? ఇంతకీ టవళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే కలిగే నష్టాలేంటి..? వీటిని అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. రండి తెలుసుకుందాం..

తరువాయి

మాడ్యులర్ కిచెన్ ఎలా ఉండాలంటే..

కొత్త ట్రెండ్స్ కేవలం ఫ్యాషన్‌కు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. మనం కొత్తగా సిద్ధమవ్వడమే కాదు.. మన ఇంటినీ కొంగొత్త ఇంటీరియర్స్‌తో సరికొత్తగా మార్చేయవచ్చు. అందులోనూ.. ప్రస్తుతం మహిళలందరూ మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా తమ ఇంటిని ట్రెండీగా, స్త్టెలిష్‌గా తీర్చిదిద్దుకోవాలని భావిస్తున్నారు కూడా.. ఈ నేపథ్యంలో చాలామంది మాడ్యులర్ కిచెన్స్‌కు ఓటేస్తున్నారు. అయితే వీటి నిర్మాణ క్రమంలో కొన్ని ముఖ్యమైన అంశాలు దృష్టిలో పెట్టుకుంటేనే వంటగది సౌకర్యవంతంగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు ఇంటీరియర్ నిపుణులు. మరి, ఆ అంశాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

కరోనా వేళ నగల్ని కూడా ఇలా శానిటైజ్ చేయాల్సిందేనట!

కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నంత మాత్రాన వైరస్‌ పీడ విరగడైంది అనుకోవడానికి లేదు.. ఎందుకంటే ఈ మాయదారి మహమ్మారి ఎప్పుడెలా విరుచుకుపడుతుందో ఎవరికీ అంతు చిక్కట్లేదు. అందుకే కొవిడ్‌ తగ్గుముఖం పట్టినా, టీకా వేసుకున్నా కనీస జాగ్రత్తలు పాటించాల్సిందే అని నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఇక బయటి నుంచి తెచ్చిన ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేయాల్సిందే అంటున్నారు. మనం రోజూ ధరించే వివిధ రకాల ఆభరణాలూ ఇందుకు మినహాయింపు కాదంటున్నారు. ఎందుకంటే కరోనా వైరస్‌ లోహాలపై మూడు గంటల నుంచి మూడు రోజుల దాకా జీవించి ఉంటుందని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో మనం రోజూ ధరించే ఆభరణాలను ఎలా శానిటైజ్‌ చేయాలో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని