నల్లని మచ్చలు తగ్గాలంటే ఏం చేయాలి? - my daughter getting lot of pimples and dark spots on face. what to do
close
Published : 02/09/2021 20:27 IST

నల్లని మచ్చలు తగ్గాలంటే ఏం చేయాలి?

మేడం.. మా పాప వయసు 14ఏళ్లు.. తెల్లగా ఉంటుంది. ఈ మధ్య ముఖం మీద మొటిమలు వచ్చాయి. మొదట్లో మేము పెద్దగా పట్టించుకోలేదు. కానీ తర్వాత అవి నల్లటి మచ్చలుగా మారుతున్నాయి. తన ముఖంలో ఏదో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఏదో నల్లగా అలుముకుంటున్నట్లు ఉంది. మచ్చల సంఖ్య కూడా చాలా ఎక్కువైంది. వాటి కారణంగా తాను మానసికంగా కుమిలిపోతోంది. పాపని చూస్తుంటే నాకు భయమేస్తోంది. అవి తగ్గాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలుపగలరు. - ఓ సోదరి

అమ్మాయిలకు టీనేజ్‌లో మొటిమలు రావడం అన్నది సర్వసాధారణమైన విషయం. శరీరంలో హార్మోన్ల స్థాయుల్లో జరిగే మార్పులు కూడా వాటికి కారణం కావచ్చు. అయితే అధిక మొత్తంలో నీళ్లు తాగడం, చర్మం జిడ్డుగా మారకుండా జాగ్రత్తపడడం ద్వారా ఇలాంటి సమస్య నుంచి కాస్త ఉపశమనం పొందచ్చు. మీ అమ్మాయి విషయంలో ముందుగా మొటిమలను నివారించి, ఆ తర్వాత మచ్చలపై దృష్టిని కేంద్రీకరించాల్సి ఉంటుంది.

మొటిమలు తగ్గేందుకు ప్యాక్:

చెంచా ముల్తానీ మట్టి తీసుకొని అందులో జీలకర్ర పొడి, దాల్చినచెక్క పొడి, లవంగం పొడి చిటికెడు చొప్పున వేసి తగినంత రోజ్‌వాటర్ జత చేస్తూ బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని మొటిమలు ఉన్న చోట అప్త్లె చేసి 15 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి మూడుసార్లు చొప్పున రెండు నెలల పాటు క్రమం తప్పకుండా చేయడం ద్వారా మొటిమలు తగ్గుముఖం పడతాయి.

నల్లని మచ్చలు తగ్గేందుకు ప్యాక్:

ఓట్స్ పౌడర్, బార్లీ పౌడర్ అరచెంచా చొప్పున తీసుకొని అందులో రోజ్‌వాటర్ వేసి మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ ప్యాక్‌ని నల్లని మచ్చలు ఉన్న చోట అప్త్లె చేసి 15 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి మూడుసార్లు చొప్పున నెల రోజుల పాటు క్రమం తప్పకుండా వేసుకోవడం ద్వారా నల్లని మచ్చలు క్రమంగా తగ్గిపోతాయి. అయితే ఈ ప్యాక్‌ని మొటిమలు పూర్తిగా తగ్గిన తర్వాత మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది.

గమనిక: ఈ ప్యాక్‌లలో పాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు.. దానివల్ల చర్మం తిరిగి జిడ్డుగా మారి, మొటిమల సమస్య పెరిగే అవకాశాలుంటాయి. కాబట్టి దానికి బదులుగా రోజ్‌వాటర్‌ని ఉపయోగించడం శ్రేయస్కరం.
ఈ ప్యాక్‌లను వేసుకుంటూ మనం తీసుకునే ఆహారంలో నూనె, మసాలా సంబంధిత పదార్థాలు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. తాజా పండ్ల రసాలు, నీళ్లు వంటివి ఎక్కువగా తీసుకోవాలి.


Advertisement


మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

తరువాయి

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని