
మహిళా కాప్ ట్రాఫిక్ విధులు.. వీడియో వైరల్
చండీగఢ్: సాధారణంగా కార్యాలయాల్లో ఉద్యోగులు కొన్నిసార్లు వారితో పాటే చంటి పిల్లలను కూడా తీసుకొస్తుంటారు. ఒకవైపు పనిచేసుకుంటూ మరోవైపు పిల్లల్ని చూసుకోవడం వాళ్లకు భారం కాకపోవచ్చు. కానీ, ఇక్కడ ఓ ట్రాఫిక్ పోలీస్ అధికారిని తన బిడ్డను భుజాలపై ఎత్తుకొని మరీ రోడ్డుపై విధులు నిర్వహిస్తున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అదేంటో చూడండి.. పంజాబ్‌లోని చండీగఢ్‌కు చెందిన ప్రియాంక గత కొద్ది రోజులుగా ట్రాఫిక్ పోలీస్ అధికారినిగా విధులు నిర్వహిస్తోంది. అయితే తన చంటి బిడ్డను చూసుకోవడానికి ఎవరూ లేరేమో గానీ.. ఆమె తన భుజాలపై బిడ్డను ఎత్తుకొని రహదారిపై ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తున్నట్లు వీడియో ద్వారా తెలుస్తోంది.
అయితే అటుగా వెళ్తున్న ప్రయాణికుడు ఈ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు వేల సంఖ్యలో వీక్షణలు వచ్చాయి. ‘ఆమె తన భుజాలపై బిడ్డను ఎత్తుకొని బాధ్యతగా విధులు నిర్వహిస్తోంది. పిల్లలపై తల్లి ప్రేమకు ఇది నిదర్శనం’ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే కొంతమంది ఆ అధికారిని పనిని వ్యతిరేకిస్తూ.. భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. ‘రహదారిపై కాలుష్యం వల్ల బిడ్డకు అపాయం జరుగుతుంది. ఇది గమనించి విధుల సమయంలో చంటి పిల్లలను వెంట తీసుకురావద్దు. ఆమె చేసిన పనిని వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వ కార్యాలయాల్లో చంటి పిల్లలకు సంరక్షణ లేదని’ కామెంట్స్ చేస్తున్నారు.
ఇవీ చదవండి
మరిన్ని
దేవతార్చన
- Curfew: తెలంగాణలో నేటి నుంచి రాత్రి వేళ!
- మీ పేరుపై ఎన్ని ఫోన్ నంబర్లున్నాయో తెలుసుకోండి
- తొలుత జ్వరం అనుకుని.. చివరి నిమిషంలో మేల్కొని..
- కొవిడ్-19 ఎందుకింత ఉద్ధృతం?ఎప్పుడు ప్రమాదకరం?
- Corona Vaccine : 44 లక్షల డోసులు వృథా
- Horoscope: ఈ రోజు రాశి ఫలం
- భారత్‌లో వ్యాక్సిన్లకు అమెరికా అడ్డుపుల్ల..!
- కార్చిచ్చులా కరోనా
- India Corona: కాస్త తగ్గిన కొత్త కేసులు
- ఆ డేటా ఫోన్లో ఉంటే డిలీట్ చేయండి: ఎస్బీఐ