Viral Video: 100 బెలూన్లను సెకన్ల వ్యవధిలోనే పేల్చేసిన ఓ బుల్లి శునకం
close

Published : 24/07/2021 23:54 IST
Viral Video: 100 బెలూన్లను సెకన్ల వ్యవధిలోనే పేల్చేసిన ఓ బుల్లి శునకం

ఇంటర్నెట్‌ డెస్క్‌: గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ అధికారులు ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రపంచ రికార్డులకు సంబంధించిన వీడియోలను నెటిజన్లతో పంచుకుంటుంటారు. తాజాగా ఒక బుల్లి శునకం ఎర్ర బుడగలు పేలగొడుతున్న 2014 నాటి ఓ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్‌ చేశారు. అది కాస్తా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. కాగా ఈ వీడియోలో కనిపిస్తున్న కుక్క పిల్ల పేరు ట్వింకీ. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ఈ కుక్క పిల్ల 2014లో 100 బుడగలను 39.08 సెకన్లలో పేలగొట్టి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ రికార్డు కెనడాకు చెందిన టోబీ అనే కుక్క పేరు మీద ఉంది. ఈ కుక్క 2017లో 100 బుడగలను కేవలం 28.22 సెకన్లలో పేలగొట్టి ట్వింకీ రికార్డును తిరగరాయడం విశేషం.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని