Viral video: కార్లను మింగేసిన భూమి
close

Published : 09/06/2021 08:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
Viral video: కార్లను మింగేసిన భూమి

జెరూసలెం: ఇజ్రాయెల్‌లోని జెరూసలెం జాతీయ రహదారికి సమీపంలోని పార్కింగ్ స్ధలంలో జరిగిన ఓ సంఘటన అందరినీ భయాందోళనకు గురి చేసింది. అక్కడ భూమి హఠాత్తుగా కుంగిపోయి మూడు కార్లు గుంతలో పడిపోయాయి. ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. వెంటనే రంగంలోకి దిగిన అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. కార్లలో మనుషులు ఉన్నారా? లేరా? అన్న విషయంలో స్పష్టత లేదని అధికారులు తెలిపారు. వరద వచ్చినప్పుడు నీరు రహదారి కింద ఉన్న భూమి పొరలను తొలగిస్తుందని.. దాని వల్ల ఇలా రహదారులు కుంగిపోతాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని
రుచులు